TELANGANA

కొల్లాపూర్ లో పాలమూరు ప్రజాభేరి.. 6 గ్యారంటీలే గెలిపిస్తాయని రేవంత్ ధీమా..

కొల్లాపూర్‌ లో కాంగ్రెస్‌ పాలమూరు ప్రజాభేరి సభకు ప్రజలు పోటెత్తారు. ఈ బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరుకావాల్సి ఉంది. అయితే ఆమె అనారోగ్య కారణాలతో రాలేకపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. హెలికాఫ్టర్ ప్రయాణం రిస్క్ అని చెప్పినా రాహుల్ గాంధీ తెగించి వచ్చారన్నారు.

 

బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయితే మరో లక్ష కోట్లు దోచుకుంటారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రకటించిన హామీలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలే వచ్చే ఎన్నికల్లో తమ కథానాయకులను తెలిపారు. ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు.

 

కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతల చేస్తున్న విమర్శలను రేవంత్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ వాళ్లే దాడులు చేయాలనుకుంటే బీఆర్ఎస్ నేతలెవరూ రోడ్డు ఎక్కలేరని స్పష్టం చేశారు. కానీ అది తమ పార్టీ విధానం కాదని తేల్చిచెప్పారు.