TELANGANA

తెలంగాణలో పెరంగున్న బీట్ల ధరలు..!

తెలంగాణ బీర్ల ధరలకు రెక్కలు వచ్చాయి. 15 శాతం మేరా పెంచుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు గత రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది ఎక్సైజ్ శాఖ. పెంచిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. బీర్ల ధరల పెంపును సిఫారసు చేసింది రిటైర్డ్ జడ్జి జైస్వాల్ ధరల నిర్ణయ కమిటీ. కమిటీ సిఫారసు మేరకు 15 శాతం ధర పెంచుతున్నట్లు ప్రభుత్వ వెల్లడించించింది.

 

ధరల సవరణతో ప్రస్తుతం ఉన్న బీర్ల ఎమ్మార్పీ 15 శాతం పెరగనుంది. ఒకవేళ పాత స్టాక్ ఉంటే వాటిపై ఎమ్మార్పీ లేబుల్స్ ను మార్చాలని ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. 15శాతం అంటే.. ఒక బీరు ధర 150 రూపాయలుంటే వివిధ సుంకాలతో కలిసి దాదాపు 180 రూపాయల వరకు పెరగవచ్చన్నమాట.

 

వాస్తవానికి రాష్ట్రంలో మద్యం ధరలు పెంచకూడదని ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. అయితే పొరుగు రాష్ట్రాల్లో మద్యం ధరలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. బీర్ల ధరలు పెంచాలని కొంతకాలంగా లిక్కర్ కంపెనీ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

 

మద్యం మార్కెట్‌లో దాదాపు 60 వాతం వాటా ఉన్నాయి మల్టీ నేషనల్ బీర్ల కంపెనీలు. ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్ ధర మీర కనీసం 30 శాతం పైగానే అదనపు ధర చెల్లించాలని కోట్ చేసింది. వీటి మాదిరిగానే మిగతా లిక్కర్ కంపెనీలు ఫాలో అయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసింది. ధరలను 15 నుంచి 19 శాతం వరకు పెంచాలంటూ నివేదికలు ఇచ్చాయి.

 

చివరకు 15 శాతం బేసిక్ ధర పెంచడానికి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇకపై ప్రతి నెలా ప్రభుత్వానికి రూ. 300 కోట్ల వరకు అదనంగా వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ఈ ఏడాది 36 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఓ అంచనా మాత్రమే.

 

నార్మల్‌గా అయితే మద్యంపై కొంత ఆదాయం తగ్గిన నేపథ్యంలో పెరిగిన ధరలతో కొంత ఆదాయం సమకూర్చుకోవచ్చన్నది సర్కార్ ఆలోచన. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్ లు, పబ్ ల ద్వారా రోజుకు సరాసరి రూ.90 కోట్ల పైగా ఆదాయం వస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

 

ఈలెక్కన నెలకు సగటున 2,500 నుంచి 3,000 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్ అధికారుల చెబుతున్నారు. దీనికితోడు సమ్మర్ వచ్చిందంటే బీర్లు సేల్స్ అమాంతంగా పెరుగుతాయి. ఒక విధంగా చెప్పాలంటే సమ్మర్ సీజన్‌లో బీర్ల ప్రియులకు ఊహించని కిక్ అన్నమాట.