ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తనదైన శైలిలో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన, ఆ సమయంలో చేసిన కొన్ని ‘బ్లేడ్ కామెంట్ల’తో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి రాజకీయ అంశంపై స్పందిస్తూ ఆయన వార్తల్లో నిలిచారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి మరియు స్థానిక ఎమ్మెల్యేకు బండ్ల గణేష్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ప్రభుత్వంలో పౌల్ట్రీ రైతులకు మేలు జరిగిందంటూ బండ్ల గణేష్ ఈ కృతజ్ఞతను వ్యక్తం చేశారు. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్ పల్లి పౌల్ట్రీ రైతులకు సంబంధించిన ఆస్తిపన్నును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన తెలిపారు. ఈ పన్ను బకాయి సుమారు ₹5.5 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు.
రద్దుకు సహకరించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారికి కృతజ్ఞతలు చెబుతూ బండ్ల గణేష్ తన సోషల్ మీడియా వేదిక (ఎక్స్) లో పోస్ట్ పెట్టారు. ఈ చర్య పౌల్ట్రీ రైతులకు ఉపశమనం కలిగించిందని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ ఆయన తన సంతోషాన్ని పంచుకున్నారు.

