ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబో ప్రకటన రోజు నుండే హైప్ కలిగించింది. ఈ చిత్ర ఒక్కో అప్డేట్ అంచనాలు పెంచుకుంటూ పోయాయి. టీసర్లో నటుడు టిను ఆనంద్ ప్రభాస్ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ అదిరింది. అడవిలో పులి, సింహం, ఏనుగు కింగ్స్… కానీ జురాసిక్ పార్క్ లో కాదు. వాడు డైనోసర్ అంటూ టిను ఆనంద్ చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. సలార్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. కాగా సలార్ ట్రైలర్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని భావించిన మేకర్స్ సెకండ్ ట్రైలర్ విడుదల చేశారు.
More
From Tollywood
నేడు ఉదయమే ట్రైలర్ విడుదల కావాల్సింది. మధ్యాహ్నం 2 గంటలకు పోస్ట్ పోన్ చేశారు. ఆ సమయానికి కూడా ట్రైలర్ రాలేదు. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు సలార్ సెకండ్ ట్రైలర్ విడుదల చేశారు. వాయిస్ ఓవర్ తో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ చెప్పారు. ‘పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ తనకు ఎంత పెద్ద సమస్య వచ్చినా… సైన్యానికి కాకుండా ఒక్కడికే చెప్పేవాడు. వాడు వద్దనుకున్నది నాశనం చేస్తాడు. కావాలనుకున్నది తెచ్చిస్తాడు’ అనే డైలాగ్ తో ప్రభాస్ క్యారెక్టర్ స్పష్టం అవుతుంది.
ఈ కథలో సుల్తాన్ పృథ్విరాజ్ అయితే ఆ ఒక్కడు ప్రభాస్. మిత్రుడు పృథ్విరాజ్ ఏది కోరుకున్నా సైన్యమై యుద్ధం చేసి తెచ్చిస్తాడు. ఇప్పటికే సలార్ మూవీ ఖాన్సార్ అనే ఒక కల్పిత ప్రాంతం మీద ఆధిపత్యం కోసం జరిగే యుద్ధం అని చెప్పేశారు. సెకండ్ ట్రైలర్ లో సీక్వెల్ కథపై కూడా హింట్ ఇచ్చారు. మొదటి భాగంలో ప్రభాస్-పృథ్విరాజ్ మిత్రులు. ఆ ప్రాణ మిత్రులు సెకండ్ పార్ట్ లో బద్ద శత్రువులుగా మారతారు.
మిత్రుడు అడిగితే ప్రాణం కూడా ఇచ్చే ప్రభాస్.. పృథ్విరాజ్ తో ఎందుకు తలపడాల్సి వచ్చింది అనేది ట్విస్ట్. సెకండ్ ట్రైలర్ లో యాక్షన్ బ్లాక్స్ కంటే కూడా కథ చెప్పిన విధానం, విజువల్స్ బాగున్నాయి. సలార్ తో ప్రభాస్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. సెకండ్ ట్రైలర్ అంచనాలు మరింతగా పెంచేసింది. శృతి హాసన్ ట్రైలర్ లో మందు అడగడం కొత్తగా తోచింది. సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ మెకానిక్ గా కనిపిస్తాడు.