World

చాపర్ కూలిన ఘటనలో హోం మంత్రి సహా 18 మంది దుర్మరణం

ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు ఈశాన్యంగా ఉన్న బ్రొవెరీ పట్టణంలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. పట్టణంలోని ఒక పాఠశాల సమీపంలో హెలీకాప్టర్ కూలిపోయింది. ఆ వెంటనే చాపర్ కు మంటలంటుకున్నాయి. Ukraine chopper crash: 18 మంది మృతి ఎమర్జెన్సీ సర్వీసెస్ కు చెందిన ఈ హెలీకాప్టర్ కూలిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఉక్రెయిన్ దేశ హోం మంత్రి డెనిస్ మోనాటిర్క్సీ మృతి చెందారు. ఆయన సహా మొత్తం 18 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారిలో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. చాపర్ కూలిన ప్రదేశం కిండర్ గార్టెన్ కు సమీపంలో ఉండడంతో ఆ పాఠశాలలోని ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.

మరో 15 మంది పిల్లలకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం 30 మంది వరకు గాయపడ్డారు. Ukraine chopper crash: రష్యాతో యుద్ధం చాపర్ కూలిన ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందని ప్రాథమికంగా నిర్దారించారు. అయితే, రష్యాతో యుద్ధం బీకరంగా సాగుతున్న నేపథ్యంలో, చాపర్ కూలిన ఘటనలో రష్యా హస్తం ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గత సంవత్సరం ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైన సమయంలో బ్రొవెరీ పట్టణంపై పట్టు కోసం రష్యా విశ్వ ప్రయత్నం చేసింది. కానీ, ఉక్రెెయిన్ దళాల చేతిలో ఓడిపోయి, వెనుదిరిగింది.