గువాహటి(guwahati)లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది. 100 ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. బయో కెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, నెఫ్రాలజీ, గైనకాలజీ, యూరాలజీ, మెడికల్ ఆంకాలజీ, పెడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియాలజీ, సర్జికల్ ఆంకాలజీ, న్యూరాలజీ, హెమటాలజీ, పాథాలజీ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భరీ చేయబోతున్నారు.
ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థలు అర్హత(qualification) విషయానికి వస్తే.. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ ఎంఎస్/ పోస్టు గ్రాడ్యుయేషన్/ డాక్టరేట్ డిగ్రీ/ ఎంసీహెచ్/ డీఎం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 50 నుంచి 58 ఏళ్ల మధ్య ఉండాలి.
అలాగే ప్రొఫెసర్ పోస్టులకు 12 నుంచి 14 ఏళ్లు, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు 8 నుంచి 10 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 3 నుంచి 6 ఏళ్లు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 1 నుంచి 3 ఏళ్ల అనుభవం ఉండాలని ఎయిమ్స్(AIIMS) నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూలో ఆధారంగా అభ్యర్థలను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,01,500ల నుంచి రూ.1,68,900ల వరకు జీతం(salary)గా చెల్లిస్తారు. దరఖాస్తుకు ఆఖరి తేది ఏప్రిల్ 30, 2023. అర్హులు మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.1500లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.