NationalWorld

అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌

ఎన్‌డీటీవీలో 26 శాతం వాటా కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. 26 శాతం వాటాకు సమానాంగా 1.67 కోట్ల షేర్లను అదానీ గ్రూప్‌ కంపెనీ ఒక్కో షేర్‌ను రూ. 294 ధరకు కొనుగోలు చేయనుంది. ఈ ఆఫర్‌ కోసం తాము రూ. 492.81 కోట్లు వెచ్చించనున్నట్లు అదానీ గ్రూప్‌ వెల్లడించింది. ఓపెన్‌ ఆఫర్‌ అక్టోబర్‌ 17వ తేదీన ప్రారంభమౌతుంది. నవంబర్‌ 1వ తేదీన ముగుస్తుంది. ఎన్‌డీటీవీ ప్రమోటర్లకు చెందిన 29.18 శాతం షేర్లను తాము కొనుగోలు చేసినట్లు అదానీ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై అదానీ గ్రూప్‌, ఎన్‌డీటీవీలు సెబీని ఆశ్రయించాయి. మరోవైపు ఎన్‌ఎస్‌ఈలో ఇవాళ కూడా ఎన్‌డీటీవీ షేర్‌ 5శాతం లోయర్‌ సర్క్యూట్‌ వద్ద ట్రేడవుతోంది. రూ. 573 తాకిన ఈ షేర్‌ ఇవాళ రూ. 468 వద్ద ట్రేడవుతోంది. ఈ ధర వద్ద 7.74 లక్షల షేర్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కాని కొనుగోలుదారులు లేరు.