World

మాస్కో విమానాశ్రయంపై డ్రోన్లతో దాడి..

రష్యా రాజధాని మాస్కో వ్నుకోవో ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టుపై డ్రోన్ల దాడి జరిగింది. ఈ దాడి రష్యా ఎయిర్ ఫోర్స్ సమర్ధవంతంగా తిప్పి కొట్టింది.

ఉక్రెనియన్ డ్రోన్‌లు దాడి చేశాయని అధికారులు చెప్పారు.

డ్రోన్ల దాడితో విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఎయిర్ డిఫెన్స్ నాలుగు డ్రోన్‌లను ధ్వంసం చేసింది. మరొక డ్రోన్ ను ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్‌లను ఉపయోగించి నేలకూల్చినట్లు మాస్కోలోని రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తెల్లవారుజామున తెలిపింది.

ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని టెలిగ్రామ్ ప్రకటనలో తెలిపింది. డ్రోన్‌లలో పేల్చడం వల్ల అగ్గి మిరుగులు వచ్చి మెయింటెనెన్స్ భవనంలో పడడంతో మంటలకు కారణమయ్యాయని ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాస్ వార్తా సేవ తెలిపింది. ఉక్రెయిన్‌ మరోసారి డ్రోన్‌ దాడులకు పాల్పడిందని మాస్కో మేయర్‌ సెర్గీ సోబియానిన్‌ అన్నారు. ఉక్రెయిన్‌ సరిహద్దు నుంచి దాదాపు 500 కిలోమీటర్ల లోపలకు చొరబడి మరీ దాడులు చేయడంపై రష్యాఆగ్రహం వ్యక్తం చేసింది.

వ్నుకోవో విమానాశ్రయం దాదాపు మూడు గంటల పాటు ఆగిపోయిన విమాన రాకపోకలు ఉదయం 8 గంటలకు తిరిగి ప్రారంభం అయ్యాయని సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. డ్రోన్ల దాడి తర్వాత 14 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించినట్లు చెప్పారు.

నగరం నైరుతిలో Vnukovo విమానాశ్రయానికి సుమారు 36km (22 మైళ్ళు) దూరంలో ఉన్న కుబింకా పట్టణంలో డ్రోన్‌లలో ఒకటి కూలిపోయిందని రష్యా ప్రభుత్వ మీడియా తెలిపింది.

డ్రోన్ దాడులు తాము చేయలేదని ఉక్రెయిన్ తెలిపింది. కైవ్‌లోని ప్రభుత్వంపై రష్యా అధికారులు నిందలు వేస్తూనే ఉన్నారని ఆరోపించింది. ఉక్రెయిన్ లోని కీవ్ రష్యా డ్రోన్లతో దాడి చేసిందని పేర్కొంది.ఇదిలావుండగా, ఉత్తర ఉక్రెయిన్ నగరం సుమీపై సోమవారం రష్యా డ్రోన్ దాడిలో మరణించిన వారి సంఖ్య మూడుకు పెరిగిందని స్థానిక మేయర్ తెలిపారు. ఈ ఘటనలో మరికొంతమంది గాయపడినట్లు చెప్పారు.