World

అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్‌పై రిపబ్లికన్లు అభిశంసన తీర్మానం

అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్‌పై రిపబ్లికన్లు అభిశంసన తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ లంచం కేసులో అతని ప్రమేయాన్ని వివరించే ఎఫ్‌బిఐ పత్రాలు బయటకు వచ్చిన నేపధ్యంలో బైడెన్‌పై అభిశంసనానికి రెడీ అయ్యారు.

సెనేటర్ చక్ గ్రాస్లీ ఎఫ్‌డీ-1023 ఫారమ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దానిలో బైడెన్‌, అతని కుమారుడు హంటర్ తాము చేసిన సహాయానికి బదులుగా కైవ్‌కు చెందిన బురిస్మా హోల్డింగ్స్ సీఈఓను మిలియన్ల డాలర్లు చెల్లించాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆరోపించారు. వైట్ హౌస్‌లో అత్యంత అవినీతి కుటుంబం ఉందని జిమ్ బ్యాంక్స్ ఆరోపించారు.

 

గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చెందిన ఇతర నాయకులు ఈ అభిశంసనకు మద్దతు పలికారు. బైడెన్‌ ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో అమెరికా తరపున పాల్గొన్నారు. బైడెన్‌ ఒక నేరస్తుడు.. అతను మనల్ని మూడో ప్రపంచ యుద్ధంలోకి నడిపిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఉక్రేయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు బైడెన్‌లు చేసిన నేరాలకు రుజువు ఉందంటూ ప్రతినిధి మార్జోరీ టేలర్ గ్రీన్ విమర్శించారు. అభిశంసన తీర్మానానికి 218 రిపబ్లికన్ ఓట్లు అవసరం.. అమెరికన్ ప్రజలు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారని ఆమె పేర్కొన్నారు.

 

మరో ప్రతినిధి ఆండీ బార్ ఇలా అన్నాడు.. బైడెన్‌ రాజీ పడ్డాడు అనడానికి ఇదే అసలైన సాక్ష్యం.. బైడెన్‌ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని అతడు పేర్కొన్నారు. వైట్ హౌస్ అధికారులు రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు చేసిన ఆరోపణలను తప్పుబట్టారు. ఆ పత్రాలు నిజానిజాలతో సంబంధం లేకుండా ప్రచురితమయ్యాయని వారు తెలిపారు. కాంగ్రెస్ రిపబ్లికన్లు నిజానిజాలతో సంబంధం లేకుండా అధ్యక్షుడు బైడన్‌పై ఆరోపణలు చేయడం సరైనది కాదని వెల్లడించారు.