World

వాడి వేడిగా కొనసాగిన గోల్డ్ మార్కెట్

వారం మొత్తం వాడి వేడిగా కొనసాగిన గోల్డ్ మార్కెట్ ఈరోజు కొంచెం శాంతించింది. నిన్న కూడా తులానికి 800 వరకూ పెరిగిన బంగారం ధర ఈరోజు మాత్రం నిలకడగా కొనసాగుతోంది. ఈ నెల మొత్తం గోల్డ్ మార్కెట్ ను పరిశీలించిన కొనుగోలుదారులు ఈరోజు మార్కెట్ ను చూసి కొంచెం ఊరట చెందారు. అయితే, ఈరోజు కూడా బంగారం ధర ఆరు నెలల గరిష్టం లోనే కొనసాగుతోంది. మరి ఈరోజు గోల్డ్ ధర ఎలా ఉన్నదో తెలుసుకోండి. Gold: నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,750 రూపాయలుగా ఉండగా, ఈరోజు బంగారం ధర స్థిరంగా నిబడి, రూ.48,750 రూపాయల వద్ద కొనసాగుతోంది.

అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు రూ.53,180 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఈరోజు బంగారం ధర ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,180 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,180 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.53,350 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,000 గా ఉంది. సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి.