World

త్వరలో దేశంలో పెట్రోల్‌ ధరలు తగ్గనున్నాయా అంటే అవునంటున్నాయి మార్కెట్‌ వర్గాలు.

త్వరలో దేశంలో పెట్రోల్‌ ధరలు తగ్గనున్నాయా అంటే అవునంటున్నాయి మార్కెట్‌ వర్గాలు. పెట్రో ధరల భారంతో ఏడాదిగా ఇబ్బంది పడుతున్న వాహనదారులకు కేంద్రం త్వరలోనే ఉపశమనం కలిగించే కబురు చెబుతుందనని తెలుస్తోంది. అంతర్జాతీయంగా తగ్గుతున్న క్రూడ్‌ ఆయిల్‌ ధరలతో దేశంలో పెట్రో ధరలు తగ్గుతాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ క్రూడ్‌ ఆయిల్‌ ధరల ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే లీటరుకు రూ.5 వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. MODI నిలకడగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు.. అంతర్జాతీయ క్రూడాయిల్‌ ధరల ఆధారంగా దేశంలో ఇంధన ధర ల్లో హెచ్చతగ్గులు ఉంటాయి. అయితే అంతర్జాతీయంగా పది నెలలుగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుతూ వసస్తున్నాయి. బ్యారెల్‌ ధర పది నెలల క్రితం 139.13 డాలర్లు ఉండగా, ప్రస్తుతం ఆధర 87,81 డాలర్లకు తగ్గింది. ఇంకా తగ్గే అవకాశమే ఉందని అంతర్జాతీయ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని రోజులుగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు వంద డాలర్లకు దిగువన ఉంటుడడంతో మన దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గుతాయని దేశీయ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. మోదీ కనికరిస్తే… రూ.5 వరకు తగ్గే చాన్స్‌.. ఇంధన ధరలను ప్రతీ 15 రోజులకు ఒకసారి సవరించేలా కేంద్రం అయిల్‌ కంపెనీలకు అవకాశం కల్పించింది. దీంతో ఏడాదిన్నరగా అయిల్‌ కంపెనీలు అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగాయని ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచుకుంటూ వచ్చాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోల్‌ ధరలు లీటరకుకు రూ.105 నుంచి రూ.110 వరకు ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఇంధన ధరలపై సమీక్ష చేస్తే లీటరుపై రూ.5 వరకు తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈమేరకు ప్రధాని జోక్యం చేసుకోవాలని దేశ ప్రజలు కోరుతున్నారు. పదేళ్ల కనిష్టానికి క్రూడ్‌ ధరలు.. 2014కు ముందు వరకు క్రూడ్‌ ధరలు 100 డాలర్లకు దిగువనే ఉన్నాయి. తర్వాత ఒపెక్‌ దేశాలు ఉత్పత్తి తగ్గించడంతో ధరలు పెరిగాయి.

గరిష్టంగా క్రూడ్‌ ధర 150 డాలర్ల వరకు పెరిగింది. దాని ప్రభావం దేశంలోని ఇంధన ధరలపై పడింది. రెండేళ్లుగా కోవిడ్‌ కారణంగా ఆదాయం తగ్గడంతో కేంద్రం ఇంధన ధరలు పెంచింది. దీంతో దేశంలో పెట్రోల్‌ ధరలు ఆల్‌టైం రికార్డు రూ.120 వరకు పెరిగాయి. కొరోనా తర్వాత కేంద్ర పెట్రో భారం తగ్గించింది. దీంతో ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రూ.105 నుంచి రూ.110 వరకు ఉన్నాయి.. కాగా, పదేళ్లల కనిష్టానికి క్రూడ్‌ ధరలు తగ్గినందున కేంద్రం కూడా ధరలు తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పది నెలల స్థాయికి పెట్రో ధరలు తగ్గే అవకాశం లేదు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రాలు పన్నుల రూపంలో సర్‌చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పదేళ్ల స్థాయికి ధరలు తగ్గే అవకాశం లేదు. కాకపోతే కాస్త ఊరటనిచ్చేలా కనిష్టంగా రూ.5 నుంచి గరిష్టంగా రూ.10 వరకు తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే కేంద్రం నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది. Petrol And Diesel Prices తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ధరలు ఇలా.. మన దేశంలో చాలా రోజులుగా పెట్రోల్, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఫ్యూయెల్‌ రేట్లను స్థిరంగా కొనసాగిసున్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్‌ రేటు రూ.109.64 వద్ద, డీజిల్‌ రేటు రూ. 97.8 వద్ద ఉన్నాయి. కొన్ని నెలలుగా ఇవే రేట్లు కొనసాగుతూ వస్తున్నాయి. ఏపీలో కూడా ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది.