World

చైనాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది

: చైనాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ వల్ల ఇంత భారీగా కేసులు నమోదవుతున్నాయని భావిస్తున్నారు.

భారత్ లోనూ ఈ వేరియంట్ ను గుర్తించారు. దాంతో, అప్రమత్తమైన భారత ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలను ప్రారంభించింది.

 

కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఈ విషయంల అలసత్వం కూడదని ప్రధాని మోదీ హెచ్చరించారు. కరోనాపై పోరుకు అన్ని వ్యవస్థలు సిద్ధంగా ఉండాలన్నారు. కోరానాను ఎదుర్కోవడంలో భాగంగా చేపట్టాల్సిన చర్యలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు పంపించింది. ఆ వివరాలు ఇవీ..

మెడికల్ ఆక్సిజన్ ను సిద్ధంగా ఉంచుకోవాలి.
ఆసుపత్రుల్లో కోవిడ్ ట్రీట్ మెంట్ కు అవసరమైన ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ను సిద్ధం చేసుకోవాలి.
లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తో పాటు ప్రెజర్ స్వింగ్ అబ్సాప్షన్(PSA) ప్లాంట్స్ పనితీరును పరీక్షించి పెట్టుకోవాలి.
పీఎస్ఏ ప్లాంట్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర ఆక్సిజన్ సంబంధిత మౌలిక వసతులను రెడీగా పెట్టుకోవాలి.
కేసుల సంఖ్య భారీగా పెరిగితే చేపట్టే చర్యలకు సంబంధించి మాక్ డ్రిల్స్ చేపట్టాలి.
అవసరమైన మానవ వనరులను, లైఫ్ సపోర్ట్ ఎక్వీప్ మెంట్ ను ప్లాన్ చేసి పెట్టుకోవాలి.