తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేసారు. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క కోరారు. బాలల హక్కులు, రక్షణ, సంక్షేమంపై ప్రత్యేకంగా గ్రామసభలు చర్చించాలని మంత్రి పేర్కోన్నారు.
గ్రామంలో సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శలతో వీ.సీ. నిర్వహించనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. బాల స్నేహపూర్వక గ్రామ పంచాయతీ’గా గ్రామాలను తీర్చిదిద్దడమే లక్ష్యం అని.. గ్రామాల్లో పిల్లలు ఎదుర్కొంటున్న పది ప్రధాన సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు చూపాలని మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. గత 12 నెలల్లో బాల్య వివాహం జరగని గ్రామాలను ‘బాల్య వివాహాల రహిత పంచాయతీలు’గా తీర్మానించాలని సీతక్క పేర్కోన్నారు.
బాల్య వివాహాల నిరోధానికి గ్రామస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, పిల్లలకు జనన ధృవీకరణ, విద్య, పోషకాహారం, ఆరోగ్యం, టీకాలు, రక్షిత మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పిల్లలకు సంబంధించిన సమస్యలు, అవసరాలను గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో చేర్చాలని, బాలల రక్షణ, అభివృద్ధిలో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేసారు.

