గుంటూరు ఘటనపై మైలవరం వైసీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్ చేశారు. ఘటనను చిలువలు, పడవులు చేసి చూడటం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. ఉయ్యూరు శ్రీనివాస్ అనే వ్యక్తి చాల మంచి వ్యక్తని.. తనకు మంచి స్నేహితుడని తెలిపారు. పేదల పట్ల అభిమానం ఉన్న వ్యక్తి ఎదన్న చేయాలనే తపనతో ఆయన సేవ చేస్తున్నాడని తెలిపారు. ప్రవాసాంధ్రుల వల్ల దేశానికి మంచి జరుగుతుందన్నారు. టీడీపీతో కలిసి కార్యక్రమం చేశాడు కాబట్టే ఉయ్యూరు శ్రీనివాస్‌పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నారైలు చేస్తున్న కార్యక్రమాలపై అపోహలు క్రియేట్ చేయవద్దని కోరారు.
గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న సంక్రాంతి కానుక కార్యక్రమన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీడీపీ అధినేత చంద్రబాబు హాజరైయ్యారు. అయితే కానుకలు తీసుకునేందుకు భారీ సంఖ్యలు ప్రజలు వచ్చారు. చంద్రబాబు వెళ్లిపోయాక కానుకలు అందిస్తున్నారు. అదే సమయంలో కాస్త తోపులాట జరగడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనపై ఉయ్యూరు ఫౌండేషన్ ఛైర్మన్ ఉయ్యూరు శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఆయన్ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా బెయిల్ మంజూరు చేశారు.