Uncategorized

అగరంపల్లి వద్ద ఐరాల మండల బిజెపి అధ్యక్షులు కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం

చిత్తూరు జిల్లా :

పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, అగరంపల్లి వద్ద ఐరాల మండల బిజెపి అధ్యక్షులు కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2019 ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కాపులకు 5% శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కార్పోరేషన్లకు విధులు కేటాయించినట్లు బడ్జెట్లో కనబడుతుంది కానీ అట్టడుగున ఉన్నటువంటి నిజమైన పేద వాళ్ళకి అందడం లేదని మాట తప్పని మడమ తిప్పని అటువంటి ముఖ్యమంత్రి మాట తప్పడం జరిగింది మడమ తిప్పడం జరిగిందని ఆయన తెలియజేశారు. కావున దీనిపై మీడియా ముఖంగా ప్రజలకు తీసుకెళ్లడానికి అగ్రం పల్లి లో ఈ సమావేశ నిర్వహించామని తెలిపారు. ముఖ్యమంత్రి కాపులకు 5% శాతం రిజర్వేషన్ కల్పించకపోవడంతో మేము ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ కార్యదర్శి మునీంద్ర ఆచారి, మండల ప్రధాన కార్యదర్శి కెవి రమణ, మండల ఉపాధ్యక్షులు బి పరదేశి, మండల కార్యదర్శి భాస్కర్ నాయుడు పాల్గొన్నారు.

బైట్. : ఐరాల మండల బిజెపి పార్టీ అధ్యక్షులు