National

జనవరి 16, 17 తేదీల్లో బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ భేటీ

జనవరి 16, 17 తేదీల్లో బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ భేటీ (BJP national executive meet) జరగనుంది. పార్టీ అగ్రనేతలు పాల్గొనే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. Cabinet reshuffle buzz: కేంద్ర మంత్రివర్గ విస్తరణ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరున ప్రారంభమవుతున్నాయి. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ప్రధాని మోదీ (PM Modi) మంత్రివర్గ విస్తరణ (Cabinet reshuffle) చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మంత్రుల పనితీరును బట్టి కొందరు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శివసేన, జనతాదళ్ యూ పార్టీలు కూటమి నుంచి వైదొలగినందువల్ల, ఆయా పార్టీల సభ్యులు నిర్వహించిన శాఖల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. దాంతో పాటు, కొన్ని శాఖల్లో మార్పుచేర్పులకు (Cabinet reshuffle) కూడా అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్ర నుంచి.. మహారాష్ట్రలో అధికార శివసేన ను చీల్చి, ఉద్ధవ్ ఠాక్రేను పదవి నుంచి దింపడంలో కీలకపాత్ర పోషించిన, ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క సారి మాత్రమే తన మంత్రివర్గంలో ప్రధాని మోదీ (PM Modi) మార్పులు చేశారు. జులై 2021లో అనూహ్య మార్పులతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (Cabinet reshuffle) చేపట్టారు. తాజాగా, చేపట్టనున్న విస్తరణలోనూ కొందరిని మంత్రి పదవి నుంచి తొలగించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని, మరి కొందరిని పార్టీ నుంచి మంత్రివర్గంలోకి తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు, మిత్రపక్షం నుంచి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ కు మంత్రివర్గంలో అవకాశం కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావదేకర్ లను తొలగించి, మాజీ ఐఏఎస్ అధికారి అశ్వని వైష్ణవ్ కు రైల్వే, ఐటీ వంటి కీలక శాఖలు అప్పగించినట్లుగా.. ఈ సారి కూడా Cabinet reshuffle కొన్ని అనూహ్య నిర్ణయాలు ఉండొచ్చని భావిస్తున్నారు.