`ఉట్టికి ఎక్కలేనమ్మ, ఆకాశానికి ఎగిరినట్టు..` అనే సామెత. దాన్ని జనసేనకు వర్తింప చేస్తే అతికినట్టు సరిపోతుంది. ఎనిమిదేళ్లుగా ఆ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో (Pawan Varaahi) ఆ పార్టీకి ఇప్పటి వరకు గుర్తింపు లేదు. పైగా ఆ పార్టీ సింబల్(Symbol) తిరుపతి లోక్ సభ ఎన్నికల్లోనే స్వతంత్రులకు కేటాయించారు. ఇటీవల ఎన్నికల కమిషన్ ప్రకటించిన గుర్తింపు కలిగిన పార్టీల జాబితాలో జనసేన లేదు. ఈసారి ఆ పార్టీకి కామన్ సింబల్ ఉంటుందన్న నమ్మకం లేదు. కానీ, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేయడానికి జనసేన సిద్ధమవడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేయడానికి జనసేన(Pawan Varaahi) ఆ పార్టీని స్థాపించిన ఎనిమిదేళ్లలో పలు పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లింది. కానీ, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓట్ల శాతాన్ని (Pawan Varaahi) సంపాదించలేకపోయింది. పైగా ఏపీలోని భీమవరం, గాజువాక రెండు చోట్లా పోటీ చేసిన పవర్ ఓడిపోయారు. ఆ పార్టీకి చాలా చోట్ల డిపాజిట్లు దక్కలేదు. వచ్చే ఎన్నికల్లో `వీరమరణం` పొందలేక టీడీపీతో పొత్తుకు సిద్దమవుతోంది. దాదాపుగా టీడీపీ, జనసేన పొత్తు ఖాయమంటూ న్యూస్ వస్తోంది. కానీ, ఒంటరిగా మాత్రమే జనసేన వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తుందని తాజాగా నాగబాబు ప్రకటించారు. అదే నిజమైతే, ఇటీవల పవన్ చేసిన `వీరమరణం` వ్యాఖ్యలకు దగ్గరగా జనసేన(Symbol) ఉందని సర్వత్రా వినిపిస్తోంది. Also Read : Pawan Kalyan: పవన్ కు ‘కొండగట్టు’ సెంటిమెంట్.. వారాహికి రంగం సిద్ధం!
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన సిద్ధమవుతోంది. తొలుత తెలంగాణ కేంద్రంగా టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయని తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలికపోకుండా చూస్తానంటోన్న పవన్ బీజేపీని కూడా కలుపుకుని పోవాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ, తెలంగాణలో బీజేపీతో పొత్తు జనసేనతో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే, ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనే జనసేన పార్టీని దూరంగా పెట్టారు. అంతేకాదు, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీని దూరంగా పెట్టడమే కాకుండా ఆ పార్టీతో ఎలాంటి సంబంధంలేదని సంకేతాలు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా వెళితే తెలంగాణ ఓటర్లు ఆదరిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మంగళవారం పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి కొండగట్టుకు.. ఏపీ, తెలంగాణాలోనూ ఒకే రకమైన పొత్తు ఉండేలా జనసేన జాగ్రత్త పడుతోంది. బీజేపీని కాదని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని వెళ్లాలని ఇటీవల ప్లాన్ చేస్తోంది. అదే జరిగితే, తెలంగాణాలోనూ తెలుగుదేశం పంచన ఉనికి కాపాడుకోవాలని జనసేన మాస్టర్ స్కెచ్ వేసింది. అందుకే, మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు నాచుపల్లి శివార్లలోని బృందావన్ రిసార్టులో తెలంగాణకు చెందిన పార్టీ ముఖ్యులతో భేటీ పవన్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చిస్తారు. Also Read :