భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దమ్మపేట మండలం,నెమలిపేట గ్రామంలో జరిగిన పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మాట్లాడుతూ నా అనుచరులను కాదు దమ్ము ఉంటే నన్ను సస్పెండ్ చేయండి,ఖలేజా ఉంటే నన్ను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ అధిష్టానాన్ని ఛాలెంజ్ చేసిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి…ఈ కార్యక్రమంలో PSR యూత్ సభ్యులు నాగకిశోర్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం పొంగులేటి వెంటే నడుస్తుందని ఆయన ఏ నిర్ణయం తీసుకున్న సైనికుల్లా పనిచేస్తామని తెలియచేసారు. ఈ ఆత్మీయ సమ్మేళనం లో పొంగులేటి వీరాభిమాని జుజ్జురి మనోహర్ పల్లెల రామలక్ష్మయ్య, సూర్యచంద్రం, ఉమా, యాసీన్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.