AP

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ, ధర్నా చేసిన నంద్యాల కాంగ్రెస్ నాయకులు

 

దేశ సంపదను దోచి కార్పొరేట్ సంస్థలకు పంచి పెడుతున్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని సామాన్య ప్రజలను దోచుకుంటున్నారన్న నంద్యాల జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, నంద్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ ల ఆదేశాల మేరకు నంద్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య,కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ చైర్మన్ సంపంగి రామకృష్ణ ల ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రధాన శాఖలముందు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు,ఈ సందర్భంగా నంద్యాల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి సర్కారు దేశ సంపదను దగాకోరు కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతూ తమను గద్దెనెక్కించిన దేశ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని, అందుకు నిదర్శనమే అదాని గ్రూప్ అతిపెద్ద ఆర్థిక కుంభకోణమని, కార్పొరేట్ సంస్థ అదాని గ్రూప్ కు ప్రధాని నరేంద్ర మోడీ బినామీ అనే విషయం తేట తెల్లమైందని, ప్రభుత్వ సంస్థలపై ఉన్న నమ్మకంతో ప్రజలు దాచుకున్న వేలాది కోట్ల రూపాయల మీద కేంద్ర ప్రభుత్వానికి ఏ అధికారం ఉందని పంచి పెడుతున్నారని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా కంటక విధానాలను నివసిస్తూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని, కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేరోజు త్వరలోనే ఉందని కేంద్రంలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం చేస్తామని తెలియజేసిన నంద్యాల కాంగ్రెస్ నాయకులు,నంద్యాల పట్టణంలో కాంగ్రెస్ నిర్వహించిన ఈ ర్యాలీ ధర్నాలో నంద్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య, బిసి సెల్ చైర్మన్ సంపంగి రామకృష్ణ, పిసిసి అధికార ప్రతినిధి వాసు, ట్రెజరరీ ప్రసాద్, కోఆర్డినేటర్ ఫరూక్, ఆర్టీసీ ప్రసాద్, శివ రామిరెడ్డి,చాబోలు సలాం,కళ్యాణ్ నంద్యాల జిల్లా పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.