AP

ఏపీ అసెంబ్లీ లో ఏడు కీలక బిల్లులు రాబోతున్నాయి…

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ముందుకు గురువారం రోజు ఏడు కీలక బిల్లులు రాబోతున్నాయి.. రేపు ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది ఏపీ అసెంబ్లీ.. ప్రశ్నోత్తరాలతో బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించనున్నారు స్పీకర్‌.. ఇక, డిమాండ్స్ కి గ్రాంట్స్ పై ఓటింగ్ జరగనుంది.. సభలో ఏడు బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల బిల్లు, ఏపీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సవరణ బిల్లు, ఏపీ ఎస్సీ కమిషన్ సవరణ బిల్లు, ఏపీ పబ్లిక్ సర్వీసెఎస్ డెలివరీ గ్యారెంటీ సవరణ బిల్లు, ఏపీ మున్సిపల్ చట్టాల్లో రెండు సవరణ బిల్లులు, ఏపీ ఎస్టీ కమిషన్ సవరణ బిల్లులు సభలో ప్రవేశపెట్టనున్నారు మంత్రులు.. ఇక, పోలవరం ప్రాజెక్టు పై బడ్జెట్‌ సమావేశాల్లో స్వల్ప కాలిక చర్చ జరగనుంది. కాగా, బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయిననాటి నుంచి ప్రతీరోజు సభలో రచ్చ జరుగుతూనే ఉంది.. టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడం.. వారిని సస్పెండ్‌ చేయడం నిత్యకృత్యంగా మారింది.. ఇక, చివరకు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలు ఘర్షణ దిగిడం హాట్‌ టాపిక్‌గా మారిపోయిన విషయం విదితమే.

 

మరోవైపు  ఏడవ రోజు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ప్రశ్నోత్తరాలతో సభను ప్రారంభిస్తారు.. అంగన్వాడీల సమస్యల పై కాలింగ్ అటెన్షన్ ఇచ్చారు ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం.. ఇక, వార్షిక బడ్జెట్ పై సమాధానం ఇవ్వనున్నారు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి.. మరోవైపు రేపు మండలి ముందుకు పది బిల్లులు రాబోతున్నాయి.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై స్వల్ప కాలిక చర్చ చేపట్టనున్నారు.