APTELANGANA

విలీనం దిశగా వైఎస్ షర్మిల రాజకీయం.?

వైఎస్సార్ తెలంగాణ పార్టీని నడపడం కష్టమవుతోందిట.! కోట్లు ఖర్చువుతున్నాయ్‌గానీ, ఫలితాలు ఆశాజనకంగా కనిపించడంలేదు. ఫలితాలెలా వస్తాయ్.?

అసలంటూ ఏ ఉప ఎన్నికలో అయినా పోటీ చేస్తే కదా.?

ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తారట. ఇంకెవరైనా నాయకులున్నారా ఆ పార్టీలో పోటీ చేయడానికి.? ప్చ్.. ఎవరూ కనిపించడంలేదు.

ఇంతమాత్రందానికి తాను మాత్రం పార్టీని నడపడమెందుకు.? అని షర్మిల అనుకుంటున్నారన్నది తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన. కర్నాటక కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్‌తో మంతనాలు జరిపి, కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేసే దిశగా అడుగులేస్తున్నారట వైఎస్ షర్మిల.

అబ్బే, నేనెందుకు పార్టీని విలీనం చేస్తాను.? అంటూ విలీనం ప్రచారంపై షర్మిల గుస్సా అయ్యారు. పొత్తుల కోసం పార్టీలు వెంపర్లాడుతున్నాయి.. అంటూ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంతకీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఎవరైనా తెలంగాణలో కలుపుకుపోవాలని చూస్తున్నారా.? లేదంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరహాలో.. సింగిల్ సింహం.. కాదు కాదు, సింగిల్ శివంగి.. అంటూ వైఎస్ షర్మిల నినదించబోతున్నారా.?

పార్టీ పెట్టారు సరే.! పాదయాత్ర చేశారు సరే.! ఓ సిద్ధాంతమంటూ ఏమైనా వుందా వైఎస్ షర్మిలకి తెలంగాణలో రాజకీయంగా.?