TELANGANA

కెరీర్ లో పురోగతి లేదా? ప్రమోషన్స్ రావట్లేదా? ఈ వాస్తు చిట్కాలు ట్రై చెయ్యండి

చాలామంది కెరీర్లో పురోగతి సాధించడం కోసం పడరాని పాట్లు పడుతుంటారు. ఎన్నో సవాళ్లను అధిగమించి, పోటీ ప్రపంచంలో ముందుకు దూసుకుపోతున్నా కెరీర్లో అనుకున్న స్థానాన్ని పొందలేకపోతారు.

కెరీర్లో పురోగతి కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎంత కష్టపడి పని చేసినా ఒక్కో సారి విజయం సాధించడం కష్టంగా మారుతుంది. ఇక అటువంటి వారు సింపుల్ వాస్తు చిట్కాలను పాటిస్తే ఉద్యోగ జీవితంలో దూసుకుపోవడానికి అవకాశం ఉంటుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం మొదట ఉద్యోగం చేసే కార్యాలయంలో కూర్చున్నచోట శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. చెల్లాచెదురుగా వస్తువులు పడేయడం, ఎక్కడపడితే అక్కడ వస్తువులను పెట్టడం మంచిది కాదని చెప్పబడింది. పనిచేసే డెస్క్ ఉత్తరం ఈశాన్యం లేదా తూర్పు దిశలో ఉండాలనే విషయం ఉద్యోగస్తులు అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా చేయడం వల్ల పనుల్లో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి.

పని చేసి టేబుల్ పై వెదురు మొక్క, క్రిస్టల్, కాయన్ షిప్, జపనీస్ కాట్ మొదలైనవాటిని పెడితే మంచి జరుగుతుందని, సానుకూల ఫలితాలు వస్తాయని చెప్పబడింది. అంతేకాదు పనిచేసే కార్యాలయంలో కూర్చునే ప్రదేశం ప్రధాన ద్వారం ఎదురుగా ఉండకూడదని, ప్రధాన ద్వారం నుండి దూరంగా ఉండాలని చెప్పబడింది. ఒకవేళ ఉద్యోగస్తులు ఇళ్లల్లో నుండి పని చేస్తుంటే పొరపాటున కూడా బెడ్ రూమ్ ను వర్క్ ప్లేస్ గా మార్చుకోవచ్చని గుర్తుంచుకోవాలి.

Vastu tips: ఈ 6 జంతువుల చిత్రాలు పెడితే ఇంట్లోకి మెరుపువేగంతో డబ్బు వస్తుంది

ఇలా చేయడం వల్ల కెరీర్ కు హాని కలుగుతుంది. అంతే కాదు పని చేసే చోట చీకటిగా ఉండకుండా చూసుకోవాలి. సహజమైన కాంతి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉంటే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలలో పురోగతి, వ్యాపారాలలో లాభాలు సాధించే అవకాశం ఉంటుంది. లాప్టాప్ లేదా కంప్యూటర్ లలో పనిచేసే వారికి సైతం వాస్తు దిశలు చెప్పబడ్డాయి.