National

ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్, దేవుడి మీద కాకుండా డీకే శివకుమార్ మీద ప్రమాణం ?

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. సీఎంగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్, 8 మంది మంత్రులు ఇప్పటికే ప్రమాణస్వీకారం చేశారు.

సోమవారం బెంగళూరులోని విధానసౌధలో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక అసెంబ్లీలో తాత్కాలిక స్పీకర్ ఆర్.వీ. దేశ్ పాండే ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 224 మంది ఎమ్మెల్యేలు విదాన సౌధలో ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఇదే సమయంలో చెన్నగిరి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బసవరాజ్ శివగంగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో కొంచెం ఓవర్ యాక్షన్ చెయ్యడంతో అసెంబ్లీలో ఉన్న సాటి శాసన సభ్యులతో పాటు స్పీకర్ షాక్ అయ్యారు.

దేవుడి మీద, రాజ్యంగం మీద ప్రమాణం చెయ్యాల్సిన చెన్నగిరి ఎమ్మెల్యే బసవరాజ్ శివగంగా ఆయనకు నచ్చిన నాయకుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరు మీద ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చెయ్యడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ సమయంలో కొందరు ఎమ్మెల్యేలు అభ్యంతంరం వ్యక్తం చేశారు. వెంటనే తేరుకున్న స్పీకర్ ఆర్.వీ. దేశ్ పాండే దేవుడి మీద కాని, రాజ్యంగం మీద కాని ప్రమాణస్వీకారం చేయ్యాలని, మనుషుల మీద ప్రమాణస్వీకారం చెయ్యకూడదని చెన్నగిరి ఎమ్మెల్యే బసవరాజ్ శివగంగకు సూచించారు.

తరువాత చెన్నగిరి ఎమ్మెల్యే బసవరాజ్ శివగంగ మళ్లీ దేవుడి మీద ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం కర్ణాటక మంత్రులు అయిన బెంగళూరులోని బీటీఎం లేఔట్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి, యమకనమరడి ఎమ్మెల్యే సతీష్ జారకిహోళి, చిత్తాపుర ఎమ్మెల్యే ప్రియాంక ఖార్గే, మంగళూరు నియోజక వర్గం ఎమ్మెల్యే యూటీ ఖాదర్ రాజ్యంగం మీద ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం విధాసనసౌధలోని అసెంబ్లీలో చాలా మంది ఎమ్మెల్యేలు దేవుడి మీద, రాజ్యంగం మీద ప్రమాణస్వీకారం చేశారు.