National

నేను ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి సుమలత మేడమ్ కారణం, ప్రతిపక్షాలతో ?

బెంగళూరు/మండ్య: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించి చాలా రోజులు అయ్యింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంది.

సీఎంగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఇప్పటికే ప్రమాణస్వీకారం చేసి 8 మంది మంత్రులతో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేశారు.

తన ఓటమికి ప్రత్యర్థులు కారణం అని ఓడిపోయిన నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే తన ఓటమికి తనకు అండగా ఉన్న లేడీ ఎంపీ కారణం అని బీజేపీ నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మండ్య జిల్లాలోని మేలుకోటే అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ ఇంద్రేష్ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

రూటు మారుస్తున్న డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకులతో ఫోటోలు, ద్వేషరాజకీయాలకు ?

మేలుకోటే అసెంబ్లీ నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా దర్శన్ పుట్టణ్ణయ్య పోటీ చేశారు. దర్శన్ పుట్టణ్ణయ్యకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అభ్యర్థిని ఆ నియోజక వర్గంలో నిలపలేదు. బీజేపీ నుంచి డాక్టర్ ఇంద్రేష్ మేలుకోటే అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు.

మేలుకోటే బీజేపీ అభ్యర్థి డాక్టర్ ఇంద్రేష్ కు మండ్య ఎంపీ సుమలత అంబరీష్ మద్దతు ప్రకటించారు. డాక్టర్ ఇంద్రేష్ నామినేషన్ వేసే సమయంలో కూడా ఆయన వెంట మండ్య ఎంపీ సమలత అంబరీష్ ఉన్నారు. కొన్ని రోజుల పాటు సుమలత అంబరీష్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ ఇంద్రేష్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు.