న్యూఢిల్లీ: ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాలనుకునే వినియోగదారులకు శుభవార్త. ఆధార్ వివరాలను ఫ్రీగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం మరింత గడువు ఇచ్చింది.
జూన్ 14 వరకే చివరి తేదీ ఉండగా.. ఉచితంగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు ఈ తేదీని సెప్టెంబర్ 14 వరకు పొడిగించింది. 14 తర్వాత డబ్బులు చెల్లించి అప్‌డేట్ చేసుకోవాలని పేర్కొన్న విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ'(UIDAI) మార్చి 15 నుంచి ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియకు జూన్ 14 వరకు గడువు ఇచ్చింది. ఇప్పుడు ఈ గడువును సెప్టెంబర్ 14 వరకు పొడిగించింది.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఉచిత ఆధార్ అప్‌డేట్ సేవను జూన్ 14 నుంచి సెప్టెంబర్ 14, 2023 వరకు 3 నెలల పాటు పొడిగించింది. కాగా, యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆయా రుజువు పత్రాలు సమర్పించాలి.
ఉచిత సేవలు మైఆధార్ పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పుట్టినతేదీ, చిరునామా వంటి మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఉచితంగా గడువు మిగిశాక మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో రూ. 50 చెల్లించి అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఉచిత సేవను ఎలా ఉపయోగించాలి?
వినియోగదారులు తమ ఆధార్ నంబర్‌ను ఉపయోగించి https://myaadhaar.uidai.gov.in/portalకి లాగిన్ చేయడం ద్వారా ఉచిత సేవను యాక్సెస్ చేయవచ్చు .
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) పంపబడుతుంది.