National

ఈక్విటీ మార్కెట్లు అంటేనే ఒడిదుడుకుల్లో ప్రయాణం

ఈక్విటీ మార్కెట్లు అంటేనే ఒడిదుడుకుల్లో ప్రయాణం సాగుతుంటుంది. రిస్క్ తీసుకొని పెట్టుబడి పెట్టివారిలో కొందరికి అతి తక్కువ కాలంలోనే అదృష్టం కలిసి వ స్తుంది.

మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందుకుంటారు. అలాంటి ఓ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ స్టాక్ పెట్టుబడిదారులను సంవత్సరం వ్యవధిలోనే మిలియనీర్లను చేసింది. అదే ఎస్‌కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ ఇండియా లిమిటెడ్ (SKM Egg Products Export India Limited).

ఈ కంపెనీ షేరు గత సంవత్సర కాలంలోనే మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. సెప్టెంబర్ 28, 2022న ఈ షేరు రూ. 103.20 వద్ద ఉంది. తాజాగా అది సెప్టెంబర్ 28, 2023 రోజున రూ. 449.25కి చేరింది. అంటే సంవత్సర కాలంలోనే పెట్టుబడిదారులకు 300 శాతం రిటర్న్స్ అందించింది. దీని ప్రకారం ఏడాది క్రితం ఇందులో రూ. 1 లక్ష పెట్టి షేర్లు కొన్న వారికి వాటి విలువ ఇప్పుడు రూ. 4 లక్షలు అవుతుంది. సంవత్సరం క్రితం రూ. 5 లక్షలు పెడితే ఇప్పుడు రూ. 20 లక్షలు అవుతోంది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ కంపెనీ మంచి ఫలితాలు ప్రకటించింది. కంపెనీ నెట్ ప్రాఫిట్ 415.5 శాతం పెరిగి రూ. 35.26 కోట్లైంది. అలాగే కంపెనీ నెట్ సేల్స్ 58.14 శాతం పెరిగి రూ. 210.23 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా ఈ కంపెనీ ఎగ్ పౌండర్, లిక్విడ్ ఎగ్స్, ఫుడ్ ఇండస్ట్రీ, హెల్త్ సెక్టార్‌లో ఉపయోగించే ఉత్పత్తును తయారు చేయడం, విక్రయించడం చేస్తుంది. ఈ కంపెనీ మొత్తం నిర్మాణం, మిషనరీ యూరప్, యూఎస్‌డీఏ రెగ్యులేషన్‌తో నడుస్తాయి.

సెప్టెంబర్ 28, 2023 ట్రేడింగ్ చూసుకుంటే SKM కంపెనీ షేరు రూ. 452 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో గరిష్ఠ స్థాయి రూ. 454.90, కనిష్ఠ స్థాయి రూ. 445గా నమోదైంది. ప్రస్తుతం రూ. 448.50 మార్క్ వద్ద ట్రేడవతూ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 559.40గా ఉంది. అలాగే కనిష్ఠ స్థాయి రూ. 97.10 గా ఉంది.