National

తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 9వ తేదీన సోమవారం (ఈరోజు) ప్రారంభం

చెన్నై/బెంగళూరు: తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 9వ తేదీన సోమవారం (ఈరోజు) ప్రారంభం అయ్యాయి. తమిళనాడు అసెంబ్లీలో ఈరోజు వివిధ తీర్మానాలు ప్రవేశపెట్టారు.

ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం ఎంకే స్టాలిన్ తో (stalin) పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ నేపథ్యంలో కావేరి (cauvery) జలాల సమస్యపై తమిళనాడు (tamil nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టారు.

ఆ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (stalin) మాట్లాడుతూ తమిళనాడు వ్యవసాయానికి పునాది అయిన కావేరి (cauvery)డెల్టా సాగునీటి రైతుల జీవనోపాధిని కాపాడాలని, అందుకు తమిళనాడులోని (tamil nadu) అందరూ సహకరించాలని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమిళనాడుకు నీరు విడుదల చేసేలా కర్ణాటక ( karnataka) ప్రభుత్వాన్ని ఆదేశించాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు.

 

అంతకుముందు మాట్లాడిన తమిళనాడు (tamil nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (stalin) కర్ణాటక కావేరి జలాల విషయంలో కృత్రిమ సంక్షోభాన్ని సృష్టిస్తోందని, కర్ణాటక ( karnataka)సరిపడా నీళ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. మొత్తం 9.19 టీఎంసీలకు బదులు 2.28 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందని, ఈ విషయంలో మాకు న్యాయం చెయ్యాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిశామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు.

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కావేరి (cauvery) జలాల పంపిణి విషయంలో జోక్యం చేసుకోవాలని కోరామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (stalin) తెలిపారు. రైతుల పంట సాగుకు నష్టం జరగకుండా చూడాలని, సుప్రీంకోర్టు ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం పాటించడం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. గత 30 ఏళ్లలో సగటున కర్ణాటక ( karnataka)డ్యామ్‌లలో 84 శాతం నీరు ఉందని స్టాలిన్ అన్నారు.

బిగ్ బాస్ హౌస్ లోకి అధికార పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఎంట్రీ, అసలే నోరు, రచ్చ షురు!

కావేరి (cauvery) నీటి కొరతపై తాను ప్రధాని నరేంద్ర మోదీకి (Modi) లేఖ రాశానని, కావేరీ మేనేజ్‌మెంట్ అథారిటీ సమావేశంలో నీటి విడుదలను 10,000 క్యూబిక్ అడుగులకు తగ్గించాలని చెప్పడంతో తమిళనాడు అధికారులు వాకౌట్ చేశారని తమిళనాడు (tamil nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (stalin) ఇదే సందర్బంలో ప్రస్తావించారు. తమిళనాడు ప్రజల ఆహార అవసరాలకే కాదు, మానవుల మనుగడకు కావేరీ జలాలు అవసరమని ఎంకే స్టాలిన్ చెప్పారు.

తమిళనాడు ప్రజలకు కావేరీ (cauvery) జలాలను అందించే విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడమని, కర్ణాటక (karnataka)మనకు ఇవ్వాల్సిన నీరు వదిలేవరకు వదిలిపెట్టబోమన్నారు. కావేరి ఇష్యూలో కేంద్ర ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించి తమిళనాడు ప్రజలకు కావేరీ జలాలను అందించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (stalin) కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు. తమిళనాడుకు రావాల్సిన కావేరి జలాలు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలని తమిళనాడు (tamil nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (stalin) డిమాండ్ చేశారు.