హైదరాబాద్: ఆదిలాబాద్ నిర్వహించిన జనగర్జనలో సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీఆర్ఎస్ సర్కారుపై చేసిన విమర్శలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
అమిత్ షా ప్రసంగమంతా అబద్ధాలేనని మండిపడ్డారు. అబద్ధాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో గుణపాఠం తప్పదని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తున్న పార్టీలను, నేతలను ప్రశ్నించే నైతికత అమిత్ షాకు లేదన్నారు.
మోడీ, అమిత్ షా ఎన్ని అబద్ధాలాడినా.. బీజేపీకి తిరస్కారం తప్పదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో మళ్లీ బీజేపీకి 110 స్థానాల్లో డిపాజిట్ గల్లంతు ఖాయమన్నారు కేటీఆర్. పరివార్ వాద్ అంటూ అమిత్‌షా మాట్లాడితే ప్రజలు పరిహాసం చేస్తున్నారన్న కేటీఆర్.. ఏ క్రికెట్ కప్ సాధించారని జైషా బీసీసీఐ పదవిలో ఉన్నారని నిలదీశారు. అమిత్‌షా కుమారుడు క్రికెట్ ఎప్పుడు ఆడారో స్పష్టం చేయాలన్నారు.
పదేళ్లలో రాష్ట్రానికి బీజేపీ ఒక్క విద్యా సంస్థ ఇవ్వలేదన్నారు కేటీఆర్. తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ విద్యాలయం, కేజీబీవీ కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో మత రాజకీయాలు చెల్లవని, రైతుల ఆత్మల్లో తెలంగాణ అగ్రస్థానమన్న అమిత్‌షా వ్యాఖ్యలు అసత్యమన్నారు. రైతు సంక్షేమం దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు.
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరిస్తామని.. ఐదేళ్ల కిందట ఆదిలాబాద్ సభలో అమిత్ షా ఇచ్చిన హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. యూనివర్సిటీకి భూమి కేటాయించలేదు అనేది పూర్తిగా అబద్ధమన్నారు కేటీఆర్. అదానీ గురించి మాట్లాడమంటే ప్రధానికి ఎందుకు నోరు పెరగలదని.. మా స్టీరింగ్ వా చేతుల్లోనే ఉంది.. బీజేపీ సీర్టింగ్ అదానీ చేతుల్లో ఉందని కేటీఆర్ అన్నారు. రైతు సంక్షేమంలో తెలంగాణ అగ్రస్థానంలోనే ఉందన్నారు. ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకే అమిత్‌షా అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు కేటీఆర్.