National

బీఆర్ఎస్ నేత కనుసన్నల్లో.. సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ దందా..

సంగారెడ్డి జిల్లాలో ఎస్వీటీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిన్నారం మండలం కొడకాంచి గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. గ్రామ శివారులో డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్టు గుర్తించారు.

 

6 నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా.. బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు కనుసన్నల్లోనే అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్టు గుర్తించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆల్ఫా జోలం, హేరైన్, కొకైన్‌తోపాటు పలు రకాల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.