ఏపీ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్ -1 కు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 81 పోస్టులతో గ్రూప్-1 కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 17న ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నారు.
డిప్యూటీ కలెక్టర్ -9, డీఎస్పీలు – 26 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకోవలసిన వారు https://psc.ap.gov.in ను చూడవచ్చు. ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ పోస్టులు9, ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ 18, డీఎస్పీ (సివిల్)26, రీజనల్ ట్రాన్స్ పోర్టు ఆఫీసర్ 6, కో-ఆపరేటివ్ సర్వీసెస్ లో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 5, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ 4, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ / అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి పోస్టులు 3, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2, జైళ్ల శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండ్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున భర్తీ చేయనున్నారు. గురువారమే గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. వెంటనే గ్రూప్ -1 పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.