National

అచ్చం సినిమా సీన్ తలపించింది.. వార్ లో ఊపిరి పీల్చుకోకుండా బతికిన కుర్రాడు

ధైర్యం ఎలాంటి ప్రమాదాన్నైనా జయిస్తుంది. శత్రువుల్ని ఎదుర్కోగలం అనుకున్నప్పుడు శక్తిని, పరిస్థితి ప్రమాదకరం అని తెలిసినప్పుడు యుక్తిని ఉపయోగిస్తే మరణాన్నైనా జయించవచ్చు అనడానికి ఈ యువకుడే ఉదాహరణ..

వివరాలలోకి వెళ్తే దక్షిణ ఇజ్రాయెల్‌లో, గాజా సరిహద్దుకు సమీపంలో, హమాస్ చేసిన ఆకస్మిక దాడిలో 1,200 మంది ఇజ్రాయెల్‌లు మరణించారు. కాగా చివరి నిమిషంలో ఓ కుటుంబానికి బ్రతికేందుకు ఓ చిన్న ఆశ్రయం లభించింది. ఈ నేపథ్యంలో వారాంతంలో అతను హమాస్ ఫైటర్స్ దాడి నుండి బయట పడ్డాడు. ఈ నేపథ్యంలో అతను మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

 

హమాస్ ఫైటర్స్ దాడిలో ఎంతో మంది మా కళ్ళ ముందే మరణించారు. హమాస్ ఫైటర్స్ మా ఇంటి పైన కూడా దాడి చేశారు. కాగా చివరి నిమిషంలో మాకు తప్పించుకునేందుకు ఓ చిన్న ఆశ్రయం దొరికింది. అయితే ఈ దాడిలో మా నాన్న చేతిని కోల్పోయారు. అలానే మా అమ్మ నా ప్రాణాలను కాపాడడానికి నాపైన చనిపోయింది. అనంతరం మా నాన్న కూడా చనిపోయారు. నేను కాసేపు శ్వాస తీసుకోవడం ఆపేసాను. అరగంట వరకు కదలకుండా చనిపోయిన వ్యక్తిలా పడి ఉన్నాను. దీనితో హమాస్ ఫైటర్స్ నేను మరణించాను అనుకుని అక్కడ నుండి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ రక్షణ దళాలు నన్ను రక్షించాయి అని తెలిపారు.