CINEMA

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా డీప్ ఫేక్ వీడియో వైరల్ …

దేశవ్యాప్తంగా డీప్ ఫేక్ వీడియోలు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో వైరల్ అయిన తర్వాత, కత్రినా కైఫ్, కాజోల్, అలియా భట్ ల డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా బాలీవుడ్ టాప్ హీరోయిన్, గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన ప్రియాంక చోప్రా డీప్ ఫేక్ బారిన పడ్డారు.

 

ప్రియాంక చోప్రా కి సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ సారి మార్ఫింగ్ చేసిన వాళ్ళు ప్రియాంక చోప్రా చేసినటువంటి ఒక ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియోకు, వాయిస్ మార్పుచేసి షాకింగ్ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఆమె ఒక నకిలీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నట్టు క్రియేట్ చేశారు.

 

ఇక ఆ బ్రాండ్ ను ఉపయోగించటం కారణంగా 2023లో తన వార్షిక ఆదాయం భారీగా పెరిగిందని ప్రియాంక చోప్రా చెప్పినట్టు సృష్టించారు. అందరూ ఇదే బ్రాండ్ ను ఉపయోగించాలని ప్రియాంక చోప్రా ఆ వీడియో ద్వారా చెప్పినట్టు క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

దీని ఒరిజినల్ ఒరిజినల్ వీడియో తెలిసిన వారంతా, ప్రియాంక చోప్రా ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పింది అనే విషయాన్ని రీ చెక్ చేసి ఇది డీప్ ఫేక్ వీడియో అని తేల్చి చెబుతున్నారు. ఇలా కూడా మార్ఫింగ్ చేస్తున్నారా అంటూ మండిపడుతున్నారు. దీనిపై అసలు నియంత్రణ లేదా అని ప్రశ్నిస్తున్నారు.

 

కేసీఆర్ సైలెన్స్ వెనుక బిగ్ ప్లాన్.. కాంగ్రెస్ కు ముందుంది మొసళ్ళ పండుగ!!

కృత్రిమ మేధతో కంటెంట్ ను తయారు చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఐటి శాఖ తీవ్రంగా స్పందించినప్పటికీ, నిత్యం డీప్ ఫేక్ వీడియోలు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. డీప్ ఫేక్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఐటీ శాఖ చెబుతోంది. ఈ మేరకు సోషల్ మీడియా సంస్థలకు కూడా నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించింది.