National

ఉద్యోగం కావాలని వెళ్లిన లేడీకి ఎలాంటి ప్రశ్నలు వేశాడంటే ?, మేడమ్ దేంతో కొట్టింది ?

బెంగళూరులోని సిలికాన్ సిటీ బసవేశ్వర నగర్‌లోని ఓ ప్రతిష్టాత్మక హోటల్‌లో ఉద్యోగం ఇప్పించాలని ఓ మహిళ కోరింది. అయితే ఈసారి హోటల్ క్యాషియర్ తనకు బెడ్ రూమ్ లో సహకరించేందుకు అంగీకరిస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు.

ఈ సమయంలో ఆగ్రహించిన మహిళ ఆ క్యాషియర్‌ను చెప్పుతో కొట్టింది. బయట ఉన్న వాళ్లు హోటల్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

సమాజంలో, మనిషి జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడాలి అని పెద్దలు చెబుతుంటారు. మొరటుతనం, అసభ్యత, దురుసుతనం ఉంటే వారికి శిక్ష పడుతుందనడానికి ఈ ఘటనే నిదర్శనం. బెంగుళూరులోని బసవేశ్వర్ నగర్‌లోని ఓ హోటల్ లో ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ ఓ మహిళ హోటల్‌కు వెళ్లింది. ఈ సమయంలో హోటల్‌ క్యాషియర్‌గా ఉన్న యువకుడు ఆమె మొబైల్‌ నంబర్‌ తీసుకుని రిసెప్షన్‌ దగ్గర కూర్చోబెట్టాడు.

ఆ మహిళ మాత్రం ఉద్యోగం సంపాధించాలని అక్కడే ఉంది. తనను ఇంటర్వ్యూ చేస్తారా, లేక విచారించి వివరాలు తెలుసుకుని ఉద్యోగం ఇప్పిస్తారా అని ఎదురు చూస్తూ కూర్చుంది. అప్పుడు మహిళ సెల్‌ఫోన్‌కు ఫోన్ చేసిన హోటల్ క్యాషియర్ యువతిని మీ ఇల్లు ఎక్కడ ఉంది, మీ పేరు ఏమిటి, మీ భర్త ఏమి చేస్తారు, మీకు ఎంత మంది పిల్లలు ఉన్నారు? నీ భర్త ఎక్కడ ఉన్నాడు, రోజూ ఎన్ని గంటలకు ఇంటికి వస్తాడు? మహిళలకు సంబంధించిన చాలా ప్రైవేట్ విషయాలపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించాడని తెలుస్తోంది.

 

ఇంకా కొంచెం ముందుకు వెళ్లిన అతను మీకు ఎలాగైనా ఉద్యోగం ఇప్పిస్తాను. అయితే ఇక్కడ పని చేయాలంటే అప్పుడప్పుడు సోఫాలో నాతో సరసాలకు సహకరించాలని, తనకు పడక సుఖం ఇవ్వాలని ఆమెకు చెప్పాడు.

హోటల్ క్యాషియర్ మాటలు విని కోపంతో రగిలిపోయిన మహిళ తాను కూర్చున్న చోటు నుంచి క్యాషియర్ కౌంటర్ వైపు వెళ్లి యువకుడి ముఖంపై చెప్పుతో కొట్టింది. ఆ తరువాత ఆమె హోటల్ నుండి బయటకు వచ్చి తనతో నడుస్తున్న ఓ యువకుడికి ఆ హోటల్ క్యాషియర్ గురించి చెప్పింది.

అనంతరం బయట ఉన్న కొందరు వ్యక్తులు, కొందరు యువకులు గుంపుగా వచ్చి హోటల్ క్యాషియర్‌ను కౌంటర్‌ నుంచి బయటకు లాగి కొట్టారు. అనంతరం పోలీసులకు ఆ హోటల్ క్యాషియర్ ను అప్పగించాలని హోటల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన హోటల్ బసవేశ్వర్ నగర్‌లోని ఆదిత్య హోటల్‌ అని పోలీసులు అన్నారు. మహిళ సమీపంలోని కురుబరహళ్లిలో నివాసం ఉంటోందని, ఉద్యోగం కావాలని అడిగిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని బాధితురాలు ఆరోపిస్తున్నది. పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి నిజానిజాలు స్పష్టంగా తెలుసుకుంటున్నారు.