TELANGANA

తెలంగాణ గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సోమవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే టీఎస్‌పీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 563 ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

 

కాగా, తాజా నోటిఫికేషన్‌లో అభ్యర్థుల వయస్సును 44 నుంచి 46కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మే లేదా జూన్‌లో ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. కాగా, గతంలో దరఖాస్తు చేసినవారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో గ్రూప్-1 కు దరఖాస్తు చేసుకున్న వారు కూడా మరో మారు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ ప్రకటనలో స్పష్టం చేసింది.

 

గ్రూప్-1 పోస్టులకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ మార్చి 23 నుంచి 27వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. హాల్ టికెట్ డౌన్‌లోడ్.. పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి పరీక్ష ప్రారంభమయ్యే నాలుగు గంటల ముందు వరకు అవకాశం ఉంటుంది. కాగా, పేపర్ లీకేజీ నేపథ్యంలో గత గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేసినట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.