TELANGANA

సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)కు ఇటీవలే సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వాటిపై స్పందించిన కవిత ఆదివారం సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కాలేనని లేఖలో స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల దృష్యా సీబీఐ నోటీసులు జారీ వల్ల అనేక ప్రశ్నలకు తావిస్తోందని కవిత తెలిపారు.

 

ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున విచారణకు రావడం అవరోధంగా ఉందని కవిత తెలిపారు. ఈ మేరకు సోమవారం(ఫిబ్రవరి 26) విచారణకు హాజరుకాలేనని సీబీఐకి కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని సీబీఐకి రాసిన లేఖలో కవిత కోరారు.అయితే, ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని కవిత పేర్కొన్నారు.

ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్యా ఫిబ్రవరి 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. సీఆర్పీసీ సెక్షన్41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదన్నారు. 2022 డిసెంబరులో ఇదే తరహా నోటీసును సెక్షన్160 కింద ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో జారీ చేసిన సెక్షన్160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని సీబీఐకి రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. సెక్షన్41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదని, నోటీసు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపంజేస్తోందన్నారు.

 

సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్ర లేదని, పైగా కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని కవిత గుర్తు చేశారు. ఈడీ నోటీసులు జారీ చేయగా సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్జనరల్సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారని లేఖలో కవిత ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో హామీ సీబీఐకి కూడా వర్తిస్తుందని కవిత ెతలిపారు. గతంలోనూ సీబీఐ బృందం హైదరాబాద్లోని తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించానని వివరణ ఇచ్చారు.