ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే ఈడీ విచారణతో ఉన్న కవితను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకపక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బిగిస్తున్న ఉచ్చు తోనే విలవిలలాడుతున్న కవిత, ఇప్పుడు కొత్తగా సిబిఐ విచారణను కూడా ఎదుర్కోబోతున్నారు. ఇక ఈ నేపద్యంలో సిబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.
సీబీఐ విచారణపై కోర్టును ఆశ్రయించిన కవిత ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారించడానికి అనుమతి తీసుకున్న సిబిఐ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలోనే కవితను విచారించడానికి అనుమతి తీసుకుంది. ఇక ఈ నేపథ్యంలో మళ్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన కవిత సిబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. కవిత తరపున రౌస్ అవెన్యూ కోర్టులో నితీష్ రాణా ఈ అంశాన్ని ప్రస్తావించారు.
రిప్లై ఇవ్వటానికి సమయం కోరిన సీబీఐ.. కేసు వాయిదా సిబిఐ విచారణను అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఎప్పుడు విచారణ జరుపుతాము అనేది ఈరోజు చెప్పాలని కవిత తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో సిబిఐ తనను ఎందుకు విచారించాలనుకుంటుందో చెప్పాలని కవిత తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో సిబిఐ ఈ అంశంలో తన రిప్లై ఇవ్వడానికి కొంత సమయం ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో సిబిఐ విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది.
స్టేటస్ కో మెయింటైన్ చెయ్యాలని కోరిన కవిత తరపు న్యాయవాది ఈ క్రమంలో తదుపరి విచారణ ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసు విచారణ జరిగే వరకు స్టేటస్ కో మెయింటైన్ చేయాలని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో వాదనలు విన్న తర్వాతనే ఎలాంటి ఆదేశాలైనా జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. అయితే సీబీఐ కూడా విచారణ మొదలు పెడితే కవితకు బెయిల్ వస్తుందా.. రాదా అన్నది ఇప్పుడు కవితకు టెన్షన్ పుట్టిస్తుంది.
తీహార్ జైలు అధికారులకు కోర్టు ఆదేశం ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలోనే కవితను విచారించడానికి అనుమతి ఇవ్వాలని సిబిఐ ప్రత్యేక కోర్టులో సిబిఐ అధికారులు పిటిషన్ దాఖలు చేయగా సిబిఐ ప్రత్యేక కోర్టు అందుకు అనుమతించింది. కవితను విచారణ చేయడానికి తీహార్ జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితను విచారించడానికి ఒకరోజు ముందే తీహార్ జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సిబిఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది.