World

జెట్ ఫైటర్స్ కోసం చైనా పైలట్లకి శిక్షణ

చైనా కి చెందిన కొత్త విమాన వాహక నౌక మీద నుంచి ఆపరేషన్ లో పాల్గొనే జెట్ ఫైటర్స్ కోసం చైనా పైలట్లకి శిక్షణ ఇవ్వడానికి అమెరికా,బ్రిటన్,జర్మనీ కి చెందిన ఫైటర్ పైలట్లు ఒప్పందాలు చేసుకొని మరీ శిక్షణ ఇస్తున్నారు. గత జూన్ నెలలో జల ప్రవేశం చేసిన చైనాకి చెందిన విమాన వాహక యుద్ధ నౌక ఫ్యూజియాన్ (దాదాపుగా లక్ష టన్నుల బరువు ఉంటుంది. స్టీమ్ టర్బైన్ ఇంజిన్ తో నడుస్తుంది) ను అమెరికా కి చెందిన ఫోర్డ్ క్లాస్, నిమిట్జ్ క్లాస్ న్యూక్లియర్ కారియర్ తో సమానంగా భావిస్తున్నారు. అయితే చైనా కి చెందిన ఫ్యూజియాన్ కారియర్ అమెరికన్ కారియర్ లతో టెక్నికల్ గా పోటీపడలేదు. ఎందుకంటే ఫోర్డ్ క్లాస్, నిమిట్జ్ క్లాస్ కారియర్ ల బ్లూ ప్రింట్ లని దొంగతనం చేసి డ్రాగన్ డిజైన్ చేసింది.

కానీ పూర్తి స్థాయి ఎలెక్ట్రానిక్స్ ను తయారుచేయలేకపోయింది. China కారియర్ మీద ఉండే యుద్ధ విమానాల నిర్వహణ తో పాటు యుద్ధ టాక్టిక్స్ ని మాత్రం కాపీ కొట్టలేకపోయింది ఎందుకంటే వాటిని నేర్చుకోవాలంటే స్వయంగా అనుభవం ఉన్న పైలట్లు కావాల్సి ఉంటుంది. అంత అనుభవం ఉన్న పైలట్లు ఎక్కడ దొరుకుతారు? అమెరికా,బ్రిటన్,జర్మనీ దేశాల పైలట్ల కి యుద్ధ కారియర్ మీద పనిచేసిన అనుభవం తో పాటు యుద్ధంలో కూడా పాల్గొన్న నేర్పరితనం ఉంది. ప్రస్తుతం 30 మంది బ్రిటీష్ కంబాట్ పైలట్లు చైనాలో ఉన్నారు. వీళ్ళు ఫాస్ట్ జెట్ ఫైటర్స్ ని నడిపిన అనుభవం తో పాటు నేరుగా విమాన వాహక యుద్ధ నౌక మీద నుంచి తమ విమానాలని టేక్ ఆఫ్ చేసి నేరుగా యుద్ధంలో పాల్గొన్న అనుభవం కూడా ఉంది.

ప్రస్తుతం ఫ్యూజియాన్ విమాన వాహక యుద్ధ నౌక మీద మోహరించబోయే చైనా కి చెందిన జే -20 ఫైటర్స్ ని ఎలా ఆపరేట్ చేయాలో శిక్షణ ఇస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇక్కడ ఆపరేషన్ అంటే యుద్ధం జరిగితే ఎలాంటి మెళుకువలు కావాలో వాటి గురించి బ్రిటిష్ పైలట్లు ట్రైనింగ్ ఇస్తున్నారు. 30 మంది కంబాట్ పైలట్లలో ఐదుగురికి ఎటాక్ హెలీకాప్టర్ ల మీద పనిచేసిన అనుభవం ఉంది. ముఖ్యంగా అమెరికన్ అపాచీ ఎటాక్ హెలీకాప్టర్ ల మీద అనుభవం ఉంది. బ్రిటీష్ పైలట్లు అందరూ 50 ఏళ్ల వయసులో ఉన్నవారే! వీళ్ళని చైనా ఎలా నియమించుకున్నది ? చైనా చాలా తెలివిగా తన పెట్టుబడితో దక్షిణాఫ్రికా లో ఒక కన్సల్టంట్ సంస్థని నెలకొల్పింది ! దాని పేరు టెస్ట్ ఫ్లయింగ్ అకాడెమీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా.

ఈ సంస్థలో ఆఫ్రికన్ల తో పాటు వివిధ దేశాల వాళ్ళు పనిచేస్తున్నారు. టెక్నికల్ గా ఈ సంస్థ దక్షిణాఫ్రికాదే అయినా పెట్టుబడి, జీతాలు అన్నీ కూడా చైనా నుంచి వస్తున్నాయి రహస్యంగా. ఈ సంస్థ మామూలు విమానాలు నడపడం కోసం పైలట్లు అవ్వాలనుకునే వారికి శిక్షణ ఇస్తుంది బయటికి. కానీ కన్సల్టంట్ పేరుతో అనుభవం ఉన్న పైలట్ల ని రిక్రూట్ చేసుకొని వాళ్ళని ట్రైనింగ్ కోసం వాడుకుంటున్నది. టెస్ట్ పప్లయింగ్ అకాడమీ ఆఫ్ సౌత్ ఆఫ్రికాకు చైనా కతమ పైలట్ల కి శిక్షణ ఇవ్వడానికి కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ సంస్థ బ్రిటీష్ పైలట్ల ని సంప్రదించింది తాము కాంట్రాక్ట్ తీసుకున్న దేశానికి వెళ్ళి అక్కడ శిక్షణ ఇవ్వాలని వివరించింది. ఒక్కో పైలట్ కి శిక్షణ ఇచ్చినందుకు గాను £240,000 లేదా $278,000 గా ఆఫర్ చేసింది.

ఇది చాలా పెద్ద మొత్తం. అయితే బ్రిటీష్ పైలట్లకు తాము శిక్షణ ఇవ్వడానికి చైనా వెళ్తున్నామని తెలుసు. ఎందుకంటే శిక్షణ ఇచ్చినందుకు పెద్ద మొత్తంలో ఇస్తున్నారు అదీ దక్షిణాఫ్రికా సంస్థ తో కాంట్రాక్ట్ కాబట్టి.అయితే ఇది బ్రిటీష్ అధికార రహస్య చట్టాలకి వ్యతిరేకం కాదా? కాదు అనే చెప్తున్నది బ్రిటన్ ప్రభుత్వం ! బ్రిటన్ అధికార రహస్య చట్టాలలో తమ దేశ పైలట్లు ఎవరూ కూడా విదేశాలకి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇవ్వకూడదు అనే నిబంధన ఏదీ లేదు. టెక్నికల్ గా బ్రిటన్ పైలట్లు ఎలాంటి తప్పు చేయలేదన్నమాట. కానీ నైతిక విలువలు పాటించి వెనక్కి రమ్మని తమ పైలట్ల కి సూచిచింది బ్రిటన్ ప్రభుత్వం. కానీ బ్రిటీష్ అధికార రహస్య చట్టాలలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయన్నది ఎవరికీ తెలియదు.

ఒక వేళ బ్రిటన్ పైలట్లు అలా చైనా వెళ్ళి శిక్షణ ఇవ్వడం నేరం. అయినా ఆ విషయం బ్రిటన్ ప్రభుత్వం దాచిపెట్టే ప్రయత్నం చేసి ఉండవచ్చు. ప్రమాదకరమయిన విషయం ఏమిటంటే నాటో కూటమిలో అమెరికా తో పాటు బ్రిటన్,ఫ్రాన్స్,జర్మనీ,కెనడా లు ఉన్నాయి. అయితే యూరోపియన్ కన్సాయార్టీయానికి చెందిన అత్యాధునిక యూరో ఫైటర్ తో పాటు అమెరికా కి చెందిన ఎఫ్-35, ఫ్రాన్స్ కి చెందిన రాఫెల్ జెట్ల మీద అందరికీ పరస్పర అవగాహన నిమిత్తం అన్ని దేశాల పైలట్లు కూడా వాటి మీద ట్రైనింగ్ తీసుకుని ఉంటారు.

ఇప్పుడు బ్రిటీష్ పైలట్లు ఆయా పశ్చిమ దేశాల జెట్ ఫైటర్స్ బలా బలాలు,బలహీనతలు చైనా పైలట్ల కి చెప్పి ఉండరు అని గ్యారంటీ ఉందా ? నైతిక విలువలు పాటించి తమ పైలట్ల ని వెనక్కి రమ్మని బ్రిటన్ ప్రభుత్వం అడగడం వెనుక రహస్యం ఏమిటి ? బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థ ఎలా ఉందో ఈ 30 మంది పైలట్లు చైనాకి వెళ్ళి శిక్షణ ఇవ్వడం సూచిస్తున్నది అనుకోవాలా ? లేక భారత్ కి వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా చైనాకి శిక్షణ ఇవ్వడానికి కంకణం కట్టుకున్నాయా ? ఈ కధనాన్ని అమెరికన్ వార్తా సంస్థ ఫాక్స్ న్యూస్ బయటపెట్టింది !

అమెరికన్ పైలట్ చైనాలో ! ఆస్ట్రేలియాలో ఉన్న అమెరికన్ పైలట్ ని అదుపులోకి తీసుకోమని అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ అభ్యర్థన మేరకు ఆస్ట్రేలియా అమెరికన్ పైలట్ ని అదుపులోకి తీసుకుంది అక్టోబర్ 25న.డానియల్ ఎడ్మండ్ డుగ్గన్ అనే 54 ఏళ్ల వయసు ఉన్న అమెరికన్ పైలట్ ని అదుపులోకి తీసుకుంది ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ డిపార్ట్మెంట్ ! అరెస్ట్ చేసిన వెంటనే కోర్టులో హాజరుపరిచారు ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లో ఆరెంజ్ అనే చిన్న పట్టణంలో ఉంటున్నాడు డానియల్ ఎడ్మండ్ డుగ్గన్ అనే ఆమెరికా పౌరుడు.

China డానియల్ ఎడ్మండ్ డుగ్గన్ ఆస్ట్రేలియాకి వలస వచ్చే ముందు అమెరికన్ నావీ లో మెరైన్ గా 1989 నుంచి 2002 వరకు అంటే పదేళ్ళు నావీ పైలట్ శిక్షకుడిగా పనిచేశాడు. ప్రధానంగా హారియర్ జంప్ జెట్ ఫైటర్ కు పైలట్ గా పనిచేశాడు నావీ లో. మేజర్ హోదాలో రిటైర్ అయ్యాడు. ప్రధానంగా హారియర్ జంప్ జెట్ పైలట్ లకి శిక్షకుడిగా పనిచేశాడు. పదవీ విరమణ తరువాత ఆస్ట్రేలియా వచ్చి టాస్మెనీయా లో ఏవియేషన్ బిజినెస్ చస్తాను అంటూ టాప్ గన్ ఆస్ట్రేలియా పేరుతో ఏవియేషన్ శిక్షణా కేంద్రాన్ని రిజిస్టర్ చేశాడు. ఆ తరువాత 2014 లో చైనా రాజధాని బీజింగ్ వెళ్ళాడు.

బీజింగ్ వెళ్ళే ముందే ఆస్ట్రేలియాలోని ఆ సంస్థను అమ్మేశాడు. ఆ ఏవియేషన్ సంస్థని ఆస్ట్రేలియా పెట్టి మూడేళ్ళ తరువాత దానిని ఇంకొకరికి అమ్మేశాడు కానీ దాని వెబ్ సైట్ ఇంకా సజీవంగానే ఉంది. ఆస్ట్రేలియా లో టాప్ గన్ ఆస్ట్రేలియా అనే ఏవియేషన్ సంస్థని నడిపిన రోజుల్లో బ్రిటన్,జర్మనీ తో పాటు అమెరికాకి చెందిన జెట్ ఫైటర్ పైలట్ల ని కూడా కాంట్రాక్ట్ మీద మాట్లాడుకొని వాళ్ళు తన కింద పనిచేయడానికి అంగీకారం తెలుపగానే 2014 లో బీజింగ్ వెళ్ళాడు. దాదాపుగా 8 ఏళ్ల తరువాత కానీ అమెరికా,బ్రిటన్ లు ఈ విషయాన్ని పసిగట్టలేకపోయాయి.

అంటే చైనా ఎంత పకడ్బందీగా వ్యవహరించిందో అర్థమవుతుంది. రాయిటర్ వార్తా సంస్థ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. లేకపోతే ఈ విషయం బయటపడేదే కాదు. చైనా అమెరికాతో యుద్ధం చేస్తుందో లేదో తెలియదు కానీ భారత్ తో మాత్రం యుద్ధం చేయడానికి కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్ ని బాగానే సమకూర్చుకుంటున్నది ! తమ పైలట్లు సంవత్సరాల తరబడి చైనాలో వాళ్ళ నావీ పైలట్ లకి శిక్షణ ఇస్తున్న సంగతి అమెరికాతో పాటు బ్రిటన్,జర్మనీ లకి తెలియకుండా ఎలా ఉంది ? ఫాక్స్ న్యూస్ ,రాయిటర్ వార్తా సంస్థలు ఈ విషయాన్ని బయటపెట్టిన తరువాత కానీ బ్రిటన్,అమెరికాలు నిజాలు ఒప్పుకున్నాయి.

ఇలా జర్మనీ, బ్రిటన్, అమెరికా పైలట్లను తమ దేశంలోకి వచ్చి తమ నేవీకి చెందిన పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి గాను చాలా మంది పైలట్ల కి వాళ్ళు సర్వీసు లో ఉండగానే వాళ్ళు అప్పటికే తీసుకుంటున్న జీతానికి మూడు రేట్లు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టింది. ఉద్యోగానికి రాజీనామా చేయించింది. ఒకటి రెండేళ్ల పాటు ఖాళీగా ఉండేట్లు చేసింది. ఆపై గుట్టు చప్పుడు కాకుండా తమ దేశానికి డ్రాగన్ రప్పించుకున్నది.

రాజీనామ చేసినా ఖాళీగా ఉన్నా ఆ కాలానికి వాళ్ళ అసలు జీతం కంటే మూడు రేట్లు జీతం కూర్చోపెట్టి మరీ ఇచ్చింది. శిక్షణ పూర్తయ్యాక ఇంకెంత అదనంగా ఇచ్చిందో ఎవరికీ తెలియదు. అందుకే వరసపెట్టి మరీ చైనాకి వెళ్లారు నాటో పైలట్లు. సో కేవలం చూడడానికే అలా కనిపిస్తాయి చైనా యుద్ధ నౌకలు. కానీ వాటి మీద పనిచేసే జెట్ ఫైటర్ పైలట్ల కి సరి అయిన ట్రైనింగ్ లేదు. అని ఇంతవరకూ భావిస్తున్న యుద్ధ రంగ నిపుణులు ఇక మీదట ఆ మాట అనలేరు !