టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు తెలుసు కదా. ఆ మధ్య తిరుపతి ఎంపీ ఉపఎన్నిక సందర్భంగా ఆయన మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది తెలుసు కదా. పార్టీ లేదు.. బొక్కా లేదు అంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలుసు కదా. ప్రచారం తర్వాత పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు నోరు జారారు. పార్టీ లేదు బొక్కా లేదు.. ఎన్నికల తర్వాత ఎత్తిపోయే పార్టీనే అంటూ టీడీపీపై ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ
యన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారే లేపాయి. మళ్లీ అలాంటి వ్యాఖ్యలనే అచ్చెన్నాయుడు రిపీట్ చేశారు. ఇటీవల జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన అచ్చెన్నాయుడు.. టీడీపీ కోసం ప్రాణాలకు తెగించి మరీ పనిచేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పిన అచ్చెన్నాయుడు.. నేతలే సిద్ధంగా లేరు అని, చివరకు తాను కూడా సిద్ధంగా లేనని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అయితే.. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో చంద్రబాబు కూడా షాక్ అయినట్టు తెలుస్తోంది. సర్వసభ్య సమావేశంలోనే అచ్చెన్నాయుడు
నేతలంతా రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చిన అచ్చెన్నాయుడు అలా అనడంపై చంద్రబాబు ఒకింత అసహనానికి గురయినప్పటికీ.. తన అసహనాన్ని మాత్రం బయటపెట్టలేదట. మరోవైపు నేతలంతా రోడ్ల మీదికి రావాలని.. అందరూ పోరాటాలకు సిద్దంగా ఉండాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎక్కువ సీట్లను సాధించాలని.. ఇప్పటికే టీడీపీ హవా మొదలైందని అచ్చెన్నాయుడు సమావేశంలో స్పష్టం చేశారు. మరోవైపు సీఎం జగన్ పై కూడా అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అమరావతే రాజధానిగా ఉండాలని జగన్ ఆరోజు ఒప్పుకుని ఇప్పుడు మాటమార్చారని దుయ్యబట్టారు.