TELANGANA

అన్‌ స్టాపబుల్‌ ఐటీ దాడులతో 24 గంటలుగా ఉక్కిరి బిక్కిరి మంత్రి మల్లారెడ్డి

అన్‌ స్టాపబుల్‌ ఐటీ దాడులతో 24 గంటలుగా ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణ కార్మిక శాఖ మంత్రి, వ్యాపారవేత్త, మెడికల్, ఇంజినీరింగ్‌ కళాశాలల అధినేత, రియల్టర్‌ చేమకూర మల్లారెడ్డి తన మార్కు డ్రామాకు తెర తీశారు. ఐటీ దాడుల సమయంలో అక్రమాల గుట్టు రట్టు కాకుండా తన ఫోన్‌ను ఓ గోనె సంచిలో వేసి పక్కింట్లో దాచిన మల్లారెడ్డి.. దాడుల మొదలై 24 గంటలు గడిచిన తర్వాత కొత్త డ్రామా షురూ చేశారని తెలుస్తోంది. మంగళవారమంతా ఎవరితోనూ కమ్యూనికేట్‌ కాకుండా కట్టడి చేశారు. Minister Malla Reddy చాతీలో నొప్పి అంటూ.. ఐటీ దాడులు బుధవారం కూడా కొనసాగుతాయని చెప్పడంతో మల్లారెడ్డి కుటుంబం ఆదోళనకు గురైంది. మరోవైపు 200 మంద అధికారులు దాడుల్లో పాల్గొనడం.. ప్రతీ లావాదేవీలపై క్షుణ్ణంగా పరిశీలిస్తుండడంతో మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి చాతీలో నొప్పి అంటూ పడిపోయాడు.

దీంతో ఐటీ అధికారులు అతడిని మేడ్‌చల్‌ జిల్లా సూరారంలోని సొంత ఆస్పత్రి నారాయణ హృదయాలయానికే తరలించారు. మహేందర్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఐటీ తనిఖీలకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతో ఈ విషయం అధికారులు ఈ విషయాన్ని మల్లారెడ్డికి తెలుపలేదు. టీవీలో చూసి రచ్చ చేసిన మల్లన్న.. 24 గంటలుగా బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయిన మల్లారెడ్డి ఐటీ వలయం నుంచి తప్పించుకునేందు శతవిధాలా ప్రతయ్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 8:30 గంటలకు టీవీ ఆన్‌చేశాడు. ఇందులో మహేందర్‌రెడ్డి అస్వస్థత గురించి బ్రేకింగ్‌ రావడంతో ఐటీ అధికారులను నిలదీశాడు. తాను ఆస్పత్రికి వెళ్తానని పట్టుపట్టాడు. నిబంధనలు ఒప్పుకోవని, మహేందర్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.

కానీ మల్లారెడ్డి.. ఐటీ వలయం నుంచి బయటకు వెళ్లడానికి ఇదే మంచి సమయంని భావించి అధికారులతో వాగ్వాదానికి దిగాడు. కారు తాళాలు లాక్కుని ఆస్పత్రికి వెళ్లేందకు గేటు వద్దకు వచ్చాడు. దీంతో విధిలేక.. ఐటీ ఐటీ అధికారులు ఆస్పత్రి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా మీడియా ముందుకు.. కొడుకును చూసేందుకు ఆస్పత్రికి వెళ్లాలని బయటకు వచ్చిన మల్లారెడ్డి గేటు బయట ఉన్న మీడియాతో మాట్లాడి ఐటీ శాఖ రూల్స్‌ బ్రేక్‌ చేశాడు. తన కొడుకుపై ఐటీ అధికారులు ఒత్తిడి తెచ్చారని, అందుకే అస్వస్థతకు గురై ఉంటాడని ఆరోపించాడు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి.. కొడుకును పరామర్శించాడు. తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. దాడులను కుట్రగా అభివర్ణించాడు. తన కొడుకును కొట్టించారు.. అంతటితో ఆగకుండడా.. మల్లారెడ్డి ఐటీ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను కష్టపడి సంపాదించి నిజాయితీగా మెలిగానన్నారు. ”ఎన్నో ఏళ్లపాటు కష్టపడితే ఈ స్థాయికి ఎదిగాను. బీజేపీ అక్రమంగా దాడులు చేయిస్తోంది. దాడులకు బెదిరేది లేదు. నా కుమారుడు ఆస్పత్రిలో చేరాడు.

సీఆర్‌పీఎఫ్‌ దళాలతో ఐటీ అధికారులు రాత్రంతా నా కొడుకును కొట్టించారు. అందుకే చాతీలో నొప్పి వచ్చినట్టుంది” అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. Minister Malla Reddy ఎరక్క వచ్చి ఇరుక్కుపోయి ఎమ్మెల్యే వివేక్.. ఇక మల్లారెడ్డి ఆస్పత్రికి వచ్చిన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వివేక్ హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకున్నాడు. మీడియాతో మల్లారెడ్డి మాట్లాడేటప్పుడు ఆయన పక్కనే ఉన్నారు. తానేం తక్కువ తినలేదు అన్నట్లు కేంద్రంపై, ఐటీ అధికారులపై తనో నాలుగు ఆరోపణ రాళ్లు వేశాడు. ఐటీ తనిఖీల్లో ఉన్నప్పుడు నిందితులుగా ఉన్నవారిని ఎవరూ కలవడానికి ఐటీ నిబంధనలు ఒప్పుకోవు. కానీ ఎమ్మెల్యే వివేక్ మాత్రం మల్లారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడడం చర్చనీయాంశమైంది. చర్యలు ఉంటాయా? కొడుకు పరామర్శకు వెళ్లిన మంత్రి మల్లారెడ్డి నిబంధనలకు విరుద్ధంగా మీడియాతో మాట్లాడడంపై ఐటీ శాఖ తీసుకునే చర్యలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. కొడుకును పరామర్శించి తిరిగి వస్తానని ఎవరితో మాట్లడనని చెప్పి అనుమతి తీసుకుని వెళ్లిన మల్లారెడ్డి ఏకంగా మీడియాతోనే మాట్లాడారు.

మరోవైపు అక్కడికి వచ్చిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివేక్ తో రహస్యంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనపై చర్యలు ఉంటాయని తెలుస్తోంది. సొంత ఆస్పత్రి నుంచి తప్పించుకునే వ్యూహమా? ఐటీ దాడుల నుంచి అక్రమ ఆదాయం నుంచి తప్పించుకునేందుకే మల్లారెడ్డి కొడుకు మహేందర్‌రెడ్డి చాతీ నొప్పి పేరుతో డ్రామా ఆడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల సమక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా అస్వస్థతకు గురైతే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలి. కానీ మహేందర్‌రెడ్డి తనను నారాయణ హృదయాలయ ఆస్పత్రికే తీసుకెళ్లాలని పట్టుపట్టినట్లు తెలుస్తోంది. అంటే సొంత ఆస్పత్రిలో సిబ్బంది, వైద్యులతో అక్రమాలను కప్పి పుచ్చే ప్రయత్నం చేయవచ్చన్న ఆరోపణలు వినిపిస్తునన్నాయి. డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ రూపంలో చీటీలు జారవేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మలుపులు తిరుగుతున్న ఐటీ తనిఖీల వ్యవహారం నుంచి మల్లారెడ్డి బయట పడతారా.. లేక ఐటీ అధికారులు తీసుకునే కఠిన చర్యలతో జైలుకు వెళ్తాడా అన్నది తెలియాలంటే వేచి చూడాలి.