CINEMA

రూ. 50 లక్షల రెమ్యునరేషన్ తగ్గించుకోడానికి రెడీ..LIGER BATCH

జీవితం ఎవ్వరినీ వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తది. టెంపర్ సినిమాలో పూరీ రాసిన డైలాగిది. సరిగ్గా గమనిస్తే కొన్ని రోజులుగా పూరీని, లైగర్ టీములో ఎవ్వరినీ వదిలిపెట్టకుండా అందరి సరదా తీర్చేస్తుంది దరిద్రం. ప్యాన్ ఇండియా మూవీగా ఆగస్ట్ 25న లైగర్ విడుదలైనా, ఆ మూవీ కష్టాల్లోంచి మాత్రం ఇప్పట్లో విడుదలయ్యేలా లేరెవరూ. సినిమా ఫైనాన్సుకు సంబంధించి ఇప్పటికే పూరీ, ఛార్మీలతో పాటు హీరో విజయ్ దేవరకొండని కూడా ఈడీ దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్.. ఇలా వీళ్ల కష్టాల్లో వీళ్లుంటే మరోవైపు హీరోయినుకి కూడా తిప్పలు తప్పట్లేదు పాపం.s లైగర్ మూవీ తో హిట్ కొట్టి ప్యాన్ ఇండియా యంగ్ యాక్ట్రెస్ గా అన్ని భాషల ఇండస్ట్రీలని ఓ ఊపు ఊపేయాలని ఆశపడింది అనన్యపాండే. పర్ ఫామెన్స్ పెద్దగా చేయలేనని తెలిసినా గ్లామరుతో అయినా ఫాలోయింగ్ పెంచేసుకోవాలని కలలు కన్నది. కానీ లైగర్ రిలీజయ్యాక సీన్ రివర్సయింది. ఫాలోయింగ్ సంగతి దేవుడెరుగు.. ట్రోల్స్, నెగిటివ్ కామెంట్సుతో కెరీరే డేంజర్ జోన్లో పడే వరకూ వచ్చింది. లైగర్ తర్వాత ఊపిరి సలపని ఆఫర్లతో బిజీ అవుతోందనుకుంటే బిగ్గెస్ట్ డిజాస్టర్లో డంబ్ హీరోయిన్ గా ఫేమయింది. దీంతో పెద్దగా ఆఫర్లు కూడా లేకుండాపోయాయి.

ఇది చాలనట్టు కొత్తగా రెమ్యునరేషన్ కష్టాలు కూడా స్టార్టయ్యాయి ఈ గ్లామర్ డాల్ కి. రూ. 50 లక్షల పారితోషికాన్ని తగ్గించు కోవాలంటూ మేకర్స్ తెగ ఒత్తిడి చేస్తున్నారట. అసలే డిజాస్టర్ ఎఫెక్ట్ గట్టిగా ఉంది. ఈ సమయంలో హీరోయిన్ గా సినిమా ఇవ్వడమే ఎక్కువ. పైగా అమ్మడి నటనా చాతుర్యం గురించి అందరికీ తెలిసిందే. సో.. మరీ కోట్లలో డిమాండ్ చేసే సిచ్యుయేషన్ లేదు కాబట్టి… అనన్య కూడా నచ్చకపోయినా రూ. 50 లక్షల రెమ్యునరేషన్ తగ్గించుకోడానికి రెడీ అయిందట. ఈ లెక్కన ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ పడితే గానీ మళ్లీ స్వింగులోకొచ్చి తన రెమ్యునరేషన్ హైక్ చేసే పరిస్థితి లేదు. నిజానికి లైగర్ మూవీపై అనన్య పాండే మాత్రమే కాదు..

విజయ్, ఛార్మీ, పూరీ ఇలా అందరూ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆ సినిమా మీద తెగ నమ్మకంతో విజయ్ కూడా పూరీ డైరెక్షన్లో JGM (జనగణమన) చేయడానికి రెడీ అయ్యాడు. లైగర్ రిలీజ్ కాకముందే ఆ మూవీ ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది కూడా. కానీ లైగర్ రిజల్ట్ చూశాక బడ్జెట్ సాకులతో ఆ ప్రాజెక్టుకు పుల్ స్టాప్ పెట్టేశారు నిర్మాతలు. లైగర్ హిట్టయితే ఆ దెబ్బతో అప్పులన్నీ తీరిపోవడంతో పాటు కెరీర్ పరంగానే ఫుల్ ఫామ్ లోకి ఒచ్చేస్తామని అనుకున్నారు పూరీ, ఛార్మి. సక్సెస్ రాకపోగా ఈడీ కేసులంటూ కొత్త తలనొప్పులొచ్చిపడ్డాయి. ఇక పూరీకి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి బెదింరిపులు, గొడవల గురించి కొన్నాళ్లుగా రచ్చ నడుస్తూనే ఉంది. సో.. లైగర్ ఎఫెక్ట్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా అన్ని రకాలుగా అందరినీ టార్గెట్ చేస్తోంది. ఈ లెక్కన పూరీ, ఛార్మిలు ఈడీ ఇష్యూల్లోంచి బయటపడి మళ్లీ కొత్త సినిమాపై ఫోకస్ పెట్టడానికి, విజయ్ అప్ కమింగ్ మూవీతో ఆడియెన్సు ముందుకొచ్చి హిట్ కొట్టడానికి, అనన్యపాండే సక్సెస్ ట్రాక్ ఎక్కి రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేయడానికి చా… లా కాలమే పట్టేలా ఉంది మరి. ఒక్క లైగర్ చేయగా ఇన్ని ఫికర్స్ పాపం.