Technology

ప్రాణం కాపాడిన యాపిల్ ఫోన్..

ప్రపంచంలోనే టెక్నాలజీ దిగ్గజమైన యాపిల్ తమ యూజర్స్ ప్రాణాలు కాపాడడం కోసం క్రాష్ డిటెక్షన్ ఫీచర్స్ ఉన్న ప్రొడక్ట్స్ ను లాంచ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో ,యాపిల్ వాచ్ సిరీస్ 8 మరియు అల్ట్రా లో ఈ ఫీచర్స్ ను పొందుపరిచారు. అయితే తాజాగా ఈ ఫీచర్ ఒక మహిళ ప్రాణాన్ని కాపాడడం విశేషం . వివరాల్లోకి వెళ్తే ఐఫోన్ 14 లో ఉన్న క్రాష్ ఫీచర్ భార్య రోడ్డు ప్రమాదానికి గురి అయింది అన్న విషయాన్ని భర్తకు తెలియజేసింది.

అంతటితో ఊరుకోకుండా యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో అడ్రస్ ,లొకేషన్ తో సహా ఆ యాప్ భర్తకు షేర్ చేయడంతో అంబులెన్స్ కంటే ముందే వెళ్లి అతని తన భార్యను కాపాడుకోగలిగాడు. నెత్తుటి మడుగులో ఉన్న తన భార్యను కరెక్ట్ టైం కి కాపాడుకోగలిగాను అంటే అంతా ఆ యాప్ వల్లే అని భర్త తన అనుభవాన్ని పంచుకుంటూ అన్నాడు. నేను పని మీద క్లైంట్ ను కలవడానికి బయటకు వెళ్లాను. అదే సమయంలో దుకాణం నుంచి తిరిగి వస్తున్న నా భార్య ఫోన్ చేస్తే తనతో మాట్లాడుతూ ఉన్నాను. అలా మాట్లాడుతున్న నా భార్య ఉన్నట్టుండి గట్టిగా కేక పెట్టింది.

ఆ తరువాత ఆమె ఫోన్ కాల్ కట్ అయింది. ఏమైందో తెలియక కంగారు పడుతున్న టైంలో సడన్గా ఓ మెసేజ్ వచ్చింది. మీ భార్యకు యాక్సిడెంట్ అయింది అని ఉన్న ఆ మెసేజ్ లో అడ్రస్ కూడా లింక్ అయి ఉండడంతో నేను వెంటనే సంఘటన స్థలానికి చేరుకోగలిగాను. విషయం తెలిసి వెంటనే బయలుదేరిన నేను అంబులెన్స్ కంటే ముందుగానే సంఘటన స్థలానికి చేరుకోగలిగాను. వెంటనే నా భార్యను హాస్పిటల్ కి తీసుకువెళ్లి ప్రాణాలు కాపాడుకోగలిగాను అని ఆ భర్త రెడ్డిట్ లో తన అనుభవాలను పోస్ట్ చేశాడు. ఇది చదివిన వారంతా వాహ్ ఆపిల్ టెక్నాలజీ అదుర్స్ అని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.