గత కొంతకాలం నుంచి రష్మిక(Rashmika) పేరు వార్తల్లో మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను లైన్లో పెట్టింది. లక్కీ హీరోయిన్ ట్యాగ్ తో కెరీర్ పరంగా ఓ రేంజ్ లో జోరు చూపించింది. ఇక రష్మికకు తిరుగులేదు అనుకుంటున్న సమయంలో.. ఈ బ్యూటీకి బ్యాడ్ టైమ్ మొదలైంది. మొన్నటి వరకు కాంతార(kantara) సినిమా విషయంలో రష్మికకు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి. సొంత గడ్డపైనే ఈ అమ్మడును ఓ రేంజ్ లో ఏకేశారు. ఒక దశలో రష్మికను కన్నడ సినీ పరిశ్రమ బ్యాన్ చేస్తోందంటూ కూడా ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి. దాంతో రష్మిక ఈ వివాదానికి తెర దించింది.
కాంతార సినిమాను చూశానని క్లారిటీ ఇస్తూనే.. తనపై ఎలాంటి నిషేధం విధించలేదని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న రష్మికకు అక్కడ నిరాశే ఎదురైంది. ఈమె తొలి సినిమా `గుడ్ బై` ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. అలాగే రెండో సినిమా `మిస్టర్ మజ్ను`(mission majnu) నేరుగా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఒకవేళ ఓటీటీలో ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా.. రష్మికకు ఒరిగేదేమీ ఉండదు. రష్మిక మూడో ప్రాజెక్ట్ `యానిమల్`. ఈ సినిమా ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇటు సౌత్ లో రష్మికకు వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. ఆమెను హీరోయిన్గా తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఎవరు ముందుకు రావడం లేదు.
ఒకరిద్దరు స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్ పోస్ట్ ఖాళీగా ఉన్నా సరే రష్మిక పేరు తెరపైకి తీసుకురావడానికి వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. అలాంటప్పుడు రష్మికను హీరోయిన్ గా తీసుకుంటే కర్ణాటకలో పలు సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అసలే టాలీవుడ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల తర్వాత కర్ణాటక అతిపెద్ద మార్కెట్. రష్మిక కారణంగా కర్ణాటక(karnataka)లో సినిమాలకు దెబ్బ పడిందంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ కారణంగానే రష్మిక జోలికి పోవడం లేదని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఇక ఇలానే కొద్ది రోజులు కొనసాగితే రష్మిక ఆఫర్లు లేక దుకాణం సర్దుకోవాల్సిందే అని కూడా అంటున్నారు. మరి రష్మిక కెరీర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.