National

రూ.2 వేలకే విమాన టికెట్.. బంపరాఫర్!

ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ అయిన ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల కోసం బంపరాఫర్ ను తీసుకొచ్చింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరకే టికెట్లను అందించేందుకు ఇండిగో సిద్దమైంది. శుక్రవారం నుంచి డిసెంబర్ 25వ తేది వరకు మూడు రోజులపాటు ప్రత్యేక సేల్ ను ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ బంపరాఫర్ కింద భారతీయ విమానయాన సంస్థ 2023 సంవత్సరాన్ని పురస్కరించుకుని రూ.2,023 నుంచి విమాన టిక్కెట్లను అందించనుంది. డిసెంబర్ 23వ తేది నుంచి 25వ తేది వరకూ మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక ఆఫర్ ను ప్రయాణికుల కోసం సౌకర్యార్థం ఉంచనుంది. అంటే దేశీయ విమానాల కోసం ఛార్జీలు రూ. 2,023 నుంచి మొదలుకానున్నాయి. అంతర్జాతీయ విమానాలకు విమాన ఛార్జీలు రూ. 4,999 నుంచి ప్రారంభమవుతాయని ఇండిగో తెలిపింది. ఇండిగో సేల్ 2023 జనవరి 15వ తేది నుంచి ఏప్రిల్ 14వ తేది వరకు ప్రయాణానికి చెల్లుబాటు అయ్యేవిధంగా ఈ సేల్ ను ప్రారంభించింది.

రూ.2 వేలకే విమాన టికెట్.. ఇండిగో బంపరాఫర్!రూ.2 వేలకే విమాన టికెట్.. ఇండిగో బంపరాఫర్!తగ్గింపుతో కూడిన విమాన ఛార్జీలతో పాటు, టిక్కెట్లను బుక్ చేసుకోవడంపై అదనపు ప్రయోజనాలను కూడా పొందొచ్చు. ప్రయాణికులు ఇండిగో బ్యాంకింగ్ భాగస్వామి హెచ్ఎస్‌బీసీ నుంచి క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందే అవకాశం ఉంటుంది. టికెట్లు అందుబాటులో ఉన్నంత వరకు మాత్రమే ఇండిగో ఈ సేవల్ని అందించనుంది. ఇండిగో విమానయాన సంస్థ నవంబర్ 2022లో 6.5 మిలియన్ల మంది ప్రయాణీకులను తమ గమ్య స్థానాలకు చేరవేసింది. అది మార్కెట్ లీడర్ చరిత్రలోనే అత్యధిక సంఖ్య కావడం విశేషం. ఇండిగో ఎయిర్ లైన్స్ ఇలా 2 వేల రూపాయల లోపే టికెట్ ధరను నిర్ణయించడంతో ప్రయాణికులు పోటీ పడి టికెట్లను కొనే అవకాశం ఉంది. ఈ ఆఫర్ మూడు రోజులు కావడం వల్ల ప్రయాణికులు త్వరపడాలని ఇండిగో ఎయిర్ లైన్స్ సూచించింది.