TELANGANA

కేసీఆర్ తరహాలో పవన్‌!

తెలంగాణ సెంటిమెంట్ తో రాజ్యాధికారాన్ని కేసీఆర్ సాధించారు. సరిగ్గా ఆయన వ్యూహాన్ని జనసేనాని పవన్ కల్యాణ్(Mega Plan) అనుసరిస్తున్నట్టు ఉన్నారు. ఒకటిన్న దశాబ్దం పాటు పైసా ఖర్చు లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్(KCR) నడిపారు. దాని వలన ఆయనకు చేకూరిన లబ్ది ఉద్యమకారులకు బాగా తెలుసు. ఇప్పుడు జనాలకు కూడా తెలిసింది. సేమ్ టూ సేమ్ కేసీఆర్ మాదిరిగా ఎనిమిదేళ్ల నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాలను చేస్తున్నారు. ఆనాడు కేసీఆర్ ఎలా టీఆర్ఎస్ పార్టీని పొత్తులతో పెంచుకుంటూ వచ్చారో, అదే తరహాలో జనసేన పార్టీని ఎనిమిదేళ్లుగా లైవ్ లో ఉంచుతూ వస్తున్నారు పవన్. కాకపోతే, కేసీఆర్ సెంటిమెంట్ ను నమ్ముకుంటే, పవన్ సామాజికవర్గాన్ని, సినిమా గ్లామర్ ను నమ్ముకున్నారు.

రాజ్యాధికారానికి దగ్గరయినట్టు పవన్ ఫీల్ (Mega plan) ఇప్పుడు రాజ్యాధికారానికి దగ్గరయినట్టు పవన్ ఫీల్ అవుతున్నారు. ఈసారి ఎన్నికల్లో సీఎం కావాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ వ్యూహాన్ని(Mega plan) తనకు వదిలేయండంటూ క్యాడర్ కు ఇటీవల దిశానిర్దేశం ఇచ్చారు. ఆయన వ్యూహం వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని తాజాగా హైదరాబాద్ రాజకీయ వర్గాల్లోని టాక్‌. ఎవరూ అడగకుండానే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి జనసేన మద్ధతు ప్రకటించింది. తెలంగాణలో పుట్టేంత అదృష్టం చేసుకోలేదని ఒకానొక సందర్భంలో పవన్ వ్యాఖ్యానించారు. కులాల కుమ్ములాటలతో కొట్టుకు చస్తున్నారంటూ ఏపీ ప్రజలను కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యల్ని గమనిస్తే టీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఎంత దగ్గరగా ఉన్నారో అర్థం అవుతోంది. పలు సందర్బాల్లో కేసీఆర్(KCR) పాలనను జనసేనాని పవన్ ప్రశంసించారు. ఇటీవల బీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. హీరోలందరి కంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ హీరో పవన్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత క్రేజీ హీరో పవన్ అంటూ ప్రశంసలు కురిపించారు. అంటే, కల్వకుంట్ల కుటుంబానికి, పవన్ కు మధ్య ఏదో నడుస్తుందన్న సంకేతాలు టాలీవుడ్ నుంచి వినిపిస్తోంది. ఎనిమిదేళ్ల కాలంలో ఎప్పుడూ పవన్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. పైగా వీలున్నప్పుడల్లా ప్రశంసిస్తూ వచ్చారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ ఒకటేనని అందరికీ తెలుసు. అయినప్పటికీ పవన్ తెలంగాణ సీఎం కేసీఆర్ పక్షాలన నిలుస్తుంటారు.