TELANGANA

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంక్షోంభం రోజుకో మలుపు

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంక్షోంభం రోజుకో మలుపు తిరుగుతోంది. కొందరు రేవంత్ ను టీపీసీసీ చీఫ్ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ, మరికొందరు తెలంగాణ పార్టీ ఇన్ చార్జి ఠాగూర్ ను సైతం మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. సీనియర్ నేతల నుంచి తీవ్ర డిమాండ్లు రావడంతో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు పార్టీ ఇన్ చార్జి మాణికం ఠాగూర్‌ను భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ లో వరుసగా తలెత్తుతున్న విభేదాల కారణంగా ఠాగూర్ తనకు తానుగా పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ రాకముందే ఠాగూర్ తన బాధ్యతల నుండి తనను తప్పించాలని పార్టీ హైకమాండ్‌ను కోరుతూ ఒక లేఖ ఇచ్చాడు.

మరోవైపు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ చీఫ్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ తదితరులతో కూడిన అసమ్మతి వర్గం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఠాగూర్ చేతులు కలిపాడని పరోక్షంగా కామెంట్స్ చేస్తున్నారు. వివిధ టీపీసీసీ కమిటీల నియామకాల ప్రక్రియలో తన ప్రమేయం లేదని కూడా భట్టి పేర్కొన్నారు. వరుస ఎన్నికల పరాజయాల నేపథ్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించకపోవడంపై అసమ్మతి వర్గం ప్రశ్నించింది. దిగ్విజయ్‌తో జరిగిన భేటీలో టీపీసీసీ చీఫ్‌, ఏఐసీసీ ఇన్ చార్జిలను మార్చాలని ఓ వర్గం నేతలు కోరారు. నేతల అభిప్రాయాలు, సూచనల మేరకు దిగ్విజయ్ పార్టీ హైకమాండ్‌కు నివేదిక పంపే అవకాశం ఉంది.