AP

కందుకూరు మృతుల కుటుంబాలకు సీఎం జగన్ 2 లక్షల ఎక్స్ గ్రేషియా

నిన్న నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు రోడ్ షోలో అపశృతి చోటు చేసుకోవడం తెలిసిందే. సభలో తోపులాట జరగటంతో తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందారు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన పట్ల దేశ ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇంకా గాయపడిన వారికి 50 వేల రూపాయలు ప్రకటించారు. ఇక ఇదే ఘటనపై ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ సైతం స్పందించారు. కందుకూరు ఘటనపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మరణించివారికి రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

ఘటనలో గాయపడ్డ వారికి రూ.50 వేల పరిహారం అందించాల్సిందిగా అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఢిల్లీ పర్యనటలో ఉన్న సీఎం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం CM Jagan condoles the families of Kandakur victims అందించాలని అదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. చంద్రబాబు ఈ ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఆర్ధికంగా కూడా ఆదుకుంటామని…కుటుంబ సభ్యులలో ఎవరైనా చదువుకుంటాం అనీ అంటే వారికి పార్టీ ద్వార అని రకాల సహకారాలు అందుతాయని చేపుకోచ్చారు.