. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ నడిపే బడా వ్యాపారి(Political Business). ఒక బుల్లి టీవీ ఛానల్ ఓనర్ గా పేరుంది. జనసేన చీఫ్(Janasena) పవన్ కల్యాణ్ సామాజికవర్గానికి చెందిన లీడర్. ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి డిపాజిట్లు కూడా పొందలేని లీడర్ చంద్రశేఖర్. పదేళ్లుకు పైగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎవరికీ అందుబాటులో ఉండరని ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన పోటీచేసి ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఏ మాత్రం పట్టలేని `తోట`ను కేసీఆర్ ఏపీ చీఫ్ గా ఎంపిక చేసుకోవడం వెనుక లాజిక్ లేకపోలేదు. బడా రియల్డర్ గా సామాజికవర్గంలో గుర్తింపు(Political Business) వేల కోట్ల రూపాయాల లావాదేవీలను హైదరాబాద్ లో తోట చంద్రశేఖర్ (Political Business)జరుపుతుంటారు. బడా రియల్డర్ గా ఆయన సామాజికవర్గంలో గుర్తింపు ఉంది. జనసేన(Janasena) పార్టీకి బాకా ఊదడానికి ఒక ఛానల్ పెట్టుకుని ఇప్పటి వరకు `మెగా` కుటుంబం మెప్పు పొందుతూ వచ్చారు. ఈసారి ఆయనకు జనసేన టిక్కెట్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు. పైగా టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అవుతుందని టాక్ ఉన్న క్రమంలో ఆయన ప్రత్యామ్నాయాల వైపు చూశారు. కానీ, ఏ పార్టీ ఆయనకు నీడను ఇవ్వలేదని రాజకీయ సర్కిల్స్ లో ఉన్న అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న చంద్రశేఖర్ ను శుభముహూర్తాన బీఆర్ ఎస్ లోకి తీసుకోవడం కేసీఆర్ వ్యూహాల్లోని హైలెట్ పాయింట్.
జనసేనలో అధినేత పవన్ కు కుడిభుజంగా మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ పనిచేశారని సొంత ఛానల్ ద్వారా బాకా ఊదించారు. కొంత కాలంగా జనసేన వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఐటి కంపెనీ అధినేతగా, ఒక బుల్లి మీడియా సంస్థ అధిపతిగా ఉన్న తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లోకి వెళ్లడం వెనుక కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఉందని సర్వత్రా వినిపిస్తోంది. ఇక జనసేన బ్రాండ్ గా రాజకీయాల్లో ఎదిగిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు బీఆర్ఎస్ చేరటం అనివార్యం అయింది. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రావెల టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. 2017లో మంత్రివర్గ విస్తరణలో పదవి పోవటంతో పార్టీకి రాజీనామా చేసారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత బీజేపీ చేరారు. మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్దసారధి బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.