AP

జీవో నెంబర్ . 1 ని వెంటనే రద్దు చేయాలి

జీవో నెంబర్ . 1 ని వెంటనే రద్దు చేయాలి

పార్వతీపురం :జీవో నెంబర్ . 1 ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ( ఎమ్.ఎల్) లిబరేషన్ పార్టి జిల్లా కార్యవర్గ సభ్యులు, అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ, కార్మిక సంఘం(అయర్ల) జిల్లా కార్యదర్శి పి. సంఘం డిమాండ్ చేశారు. పార్వతీపురం మండలం, చినమరికి గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ.. ప్రజా హక్కులను కాలరాసే , ప్రజాసంఘాల నాయకులు గొంతు నొక్కే జీవో నెంబర్ . 1 ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని అన్నారు. లేనియెడల వైసీపీ ప్రభుత్వ ఆగడాలను అడ్డుకట్ట వేయడానికి సీపీఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ ఎక్కడికక్కడ ప్రజా ఉద్యమాలు చేస్తూ ముందుకు పోతుందని హెచ్చరించారు. అలాగే 2023, ఫిబ్రవరి 15-20 తేదీలలో పాట్నా- బీహార్ లో జరిగబోయే 11 వ జాతీయ మహాసభలకు ప్రతి ఒక్కరూ హాజరయ్యి మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో అలజంగి.రాణి, నామాల.గంగ, గంటా. చిన్నారావు, గరుగుబిల్లి. భారతి , గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.