AP

కోడిపందాలు రాయుళ్ల వ్యూహాలను పెదవేగి తహసీల్దార్ ఎన్.నాగరాజు, ఎస్.ఐ లక్ష్మణ్ తారుమారు

ఏలూరున జిల్లా….
పెదవేగి మండలం, కూచింపూడి గ్రామంలో కోడిపందాలు రాయుళ్ల
వ్యూహాలను పెదవేగి తహసీల్దార్
ఎన్.నాగరాజు, ఎస్.ఐ లక్ష్మణ్ తారుమారు చేశారు. అధికారుల కళ్లుగప్పి అందంగా నిర్మించుకున్న
కోడిపందాలు బిరులను, గురువారం తహసీల్దార్, ఎస్.ఐ లు తమ
సిబ్బందితో వెళ్లి ధ్వంసం చేశారు. గత రెండేళ్లుగా కోడిపందాలు నిషేధం అనే ప్లెక్సీలు వాడ వాడలా పెట్టి సంక్రాంతి మూడురోజులు రాజకీయ వత్తిడుల వల్ల అధికారులు
చూసి చూడనట్టు వదిలేశారు. అదే పరిస్థితి ఈ ఏడాది కూడా మూడురోజులు పందాలు ఉంటాయని ఎదురు చూస్తున్న కోడి పందెం రాయుళ్ళ ఆలోచనలకు అడుగడుగునా అడ్డుపడుతూనే ఉన్నారు. అధికారులు రాజకీయ నాయకులు కోడిపందాలు సాంప్రదాయమంటూ,
అనధికార అనుమతులు ఇచ్చేవారు. అటువంటి అనుమతులుకు అవకాశమే లేదని
కోడిపందాలు, పేకాటలు నిర్వహిస్తే ఎంతటి వారినైనా, చట్ట పరంగా చర్యలు చేపడతామని, పెదవేగి తహసీల్దార్ నాగరాజు,ఎస్ ఐ లక్ష్మణ్ లు గురువారం కూచింపూడిలో పందెం రాయుళ్లకు హెచ్చరికలు జారీచేశారు. మండలం లో ఎక్కడైనా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి కోడిపందాలు నిర్వహిస్తే నాన్ బెయిల్ కేసులు తప్పవని హెచ్చరించారు.