AP

యువతకు వివేకానందుడు ఆదర్శ ప్రాయం

పార్వతీపురం మన్యం జిల్లా: యువతకు వివేకానందుడు ఆదర్శ ప్రాయమని వృద్ధ మిత్ర కోఆర్డినేటర్ (హెచ్.సి1273) కె. కృష్ణమూర్తి అన్నారు. స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా పార్వతీపురం మండలం, చిన్నమరికి గ్రామంలో ఉన్న నిరుపేదలకు, వృద్దులకు, దుప్పట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ…స్వామి వివేకనందుని ఆశయాలు, మార్గం అనుసరణీయమని తెలిపారు.ఆయన జాతికందించిన సేవలు ఎనలేనివాని కొనియాడారు. కావున నేటి యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకొని జాతి హితానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అలాగే గ్రామ ప్రజలు మాట్లాడుతూ… పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్లో వృద్ధ మిత్ర కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న కృష్ణమూర్ సేవలు నిస్వార్థమైనవని అన్నారు. ప్రతీనెల తన జీతంలో కొంత భాగాన్ని పేదలకు, వృద్ధులకు, వికలాంగులు కు కేటాయించి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.